Switch to English

పూనమ్‌ ఫిర్యాదుతో శ్రీరెడ్డికి మూడినట్లేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

గత కొంతకాలంగా హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌పై దుష్ప్రచారం చేసేలా కొన్ని వీడియోలు సోషల్‌ మీడియాలో దర్శనమిస్తున్నాయి. వీడియోలు మాత్రమే కాదు, ఆడియో టేపులూ సోషల్‌ మీడియాలో కలకలం సృష్టించాయి. పూనమ్‌ కౌర్‌ పెద్దగా పేరున్న సినిమాలేమీ చేయలేదు. కానీ ఆమె పేరు మాత్రం మార్మోగిపోతూనే ఉంది. అది కూడా పవన్‌ కళ్యాణ్‌ పేరుతో ముడిపెట్టిన కొన్ని గాసిప్స్‌ కారణంగానే. పవన్‌ కళ్యాణ్‌, పూనమ్‌ కౌర్‌ మధ్య ఏదో ఉందని కొన్ని గాలి వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. వాటిని పవన్‌ కళ్యాణ్‌ కానీ, పూనమ్‌ కౌర్‌ కానీ, ఇప్పటి వరకూ సీరియస్‌గా తీసుకోలేదు.

తాజాగా పూనమ్‌ కౌర్‌ పోలీసులనాశ్రయించింది. తనపై దుష్ప్రచారం జరుగుతోందనీ, ఆ దుష్ప్రచారం వల్ల తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలుగుతోందనీ, ఫిర్యాదులో పేర్కొంది ఈ నటి. ఇదిలా ఉంటే, పూనమ్‌ కౌర్‌ని పవన్‌ కళ్యాణ్‌ మోసం చేశాడంటూ ఈ అంశానికి అత్యంత జుగుప్సాకరంగా ప్రాధాన్యతనిస్తూ, సోషల్‌ మీడియాలో శ్రీరెడ్డి సంచలన పోస్టింగులు పెడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టీ శ్రీరెడ్డి మీదనే పడింది. పూనమ్‌ కౌర్‌ తన ఫిర్యాదులో శ్రీరెడ్డి పేరును పరోక్షంగా ప్రస్తావించారని ప్రచారం జరుగుతోంది. అదే కనుక నిజమైతే శ్రీరెడ్డి చిక్కుల్లో పడ్డట్లే.

తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాల పేరుతో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ కొందరు సినీ ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేస్తూ శ్రీరెడ్డి అర్ధ నగ్న నిరసన తెలపడం, ఆ తర్వాత అనూహ్యంగా ఆమె పవన్‌ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా టర్న్‌ తీసుకోవడం, తెలిసిన విషయమే. తెర వెనక పెద్దలు కొందరు ఆమెతో పవన్‌ కళ్యాణ్‌ని తిట్టించారనీ, అప్పట్లో వార్తలు వచ్చాయి. ఓ దశలో ఆమె జుగుప్సాకరమైన తీరును తెలుగు మీడియా సైతం తట్టుకోలేకపోయింది. దాంతో శ్రీరెడ్డికి తెలుగు మీడియాలో ప్రాధాన్యత లేకుండా పోయింది.

చెన్నైకి వెళ్లిపోయి, అక్కడేదో కొంత గందరగోళం చేసి మళ్లీ హైద్రాబాద్‌కి తిరిగొచ్చిన శ్రీరెడ్డి పూనమ్‌ కౌర్‌ పేరును అడ్డం పెట్టుకుని పవన్‌ కళ్యాణ్‌పై జుగుప్సాకరమైన సోషల్‌ యుద్ధం చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే పూనమ్‌, పవన్‌ కళ్యాణ్‌ మధ్య పుకార్లను పెంచేసింది. రాజకీయంగా పవన్‌ కళ్యాణ్‌ని దెబ్బ కొట్టే క్రమంలో శ్రీరెడ్డి, పూనమ్‌ కౌర్‌ పరువును బజారుకీడ్చేసింది. అయితే ఈ విషయంలో పూనమ్‌ కౌర్‌ చాలా హుందాగా వ్యవహరించింది. జరుగుతున్న దుష్ప్రచారంపై ఇంతవరకూ పెదవి విప్పలేదు. ఇప్పుడు పోలీసుకలు ఫిర్యాదు చేయడం ద్వారా తన విజ్ఞతను చాటుకుంది ఆమె.

పూనమ్‌ కౌర్‌ మాత్రమే కాదు, శ్రీరెడ్డి బాధితుల్లో చాలా మందే ఉన్నారు. వాళ్లంతా ఒకరి తర్వాత ఒకరు పోలీసుల్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారనీ సమాచారమ్‌. జనసేన పార్టీ తరపున కూడా శ్రీరెడ్డిపై చర్యల కోసం న్యాయపోరాటం చేయబోతున్నట్లు తెలుస్తోంది. సోషల్‌ మీడియాని ఎలా ఉపయోగించకూడదో శ్రీరెడ్డిని చూస్తే అర్ధమవుతుంది. నచ్చని వ్యక్తిని విమర్శించడం తప్పు కాకపోవచ్చు. ఆ విమర్శల తీవ్రతను జుగుప్స స్థాయికి చేర్చేసి ఆ స్థాయిని కూడా దాటించేస్తే పరిస్థితులు తీవ్రంగానే ఉంటాయి.

యూట్యూబ్‌ ఛానెళ్ల పుణ్యమా అని బూతు ప్రచారానికి ఆకాశమే హద్దుగా మారింది. షర్మిలా, లక్ష్మీపార్వతి, పూనమ్‌ కౌర్‌.. ఇలా బాధితులు ఎందరో. దురదృష్టమేంటంటే, బాధపెట్టేవారిలో శ్రీరెడ్డి లాంటి మహిళలు కూడా ఉండడం.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...