Switch to English

పవన్‌తో జగన్‌: దోస్తీ కోసం కుస్తీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

నిన్నటి స్నేహం నేడు వైరంగా మారొచ్చు. నేటి వైరం రేపటి స్నేహంగానూ మారొచ్చు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులూ ఉండరు కాక ఉండరు. పొద్దున్నో పార్టీ.. మద్యాహ్నం ఇంకో పార్టీ కుదిరితే సాయంత్రానికి మరో పార్టీ.. ఇలా సాగుతోంది రాజకీయ నాయకుల రాజకీయ ప్రస్థానం ఇటీవలి కాలంలో. ఇది కొత్త తరహా రాజకీయం. దీన్నసలు రాజకీయం అని అనాలో, వద్దో కూడా సగటు మనిషికి అర్ధం కాని వైనం. నాయకుల కప్ప గంతులు సంగతి పక్కన పెడితే, రాజకీయ పార్టీలు పొత్తుల పేరుతో అంతకు మించిన కప్పల తక్కెడ వ్యవహారాన్ని నడుపుతున్నాయి.

2014 ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేసింది. ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు కానీ టీడీపీ, బీజేపీ కూటమికి ఓటేయమని, కాళ్లకు బలపం కట్టుకుని ఎన్నికల ప్రచారంలో హల్‌ చల్‌ చేసింది. ఈ ఎన్నికల సమయానికి ఆ రెండు పార్టీలతో తెగతెంపులు చేసుకున్న పవన్‌ వామ పక్షాలు, బీఎస్‌పీతో కలిసి ప్రయాణం చేశారు. ఇదిలా ఉంటే, జనసేన కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్నేహ హస్తం అందిస్తోందనే ప్రచారమొకటి వెలుగులోకి వచ్చింది.

వాస్తవానికి ఇలాంటి అవకాశం ఏదైనా ఉంటే గద్దలా తన్నుకుపోవడానికి చంద్రబాబే సిద్ధంగా ఉన్నాడు. అయితే చంద్రబాబుకు ఆ అవకాశం అస్సలు ఇవ్వకూడదని వైఎస్‌ జగన్‌కి కొందరు సన్నిహితులు సూచించారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌ సీపీకి చెందిన ఓ ముఖ్య నేత జగన్‌ తరపున పవన్‌ వద్దకు రాయబారం పంపినట్లు తెలుస్తోంది. అయితే ఈ రాయబారంపై పవన్‌ స్పందన ఏంటనేది తెలియరాలేదు. మరోపక్క జగన్‌, పవన్‌ కలవాల్సిందేనన్న బలమైన కోరికతో ఓ శక్తి తన ప్రయత్నాన్ని మరింత ముమ్మరం చేసిందట. ఒకవేళ జగన్‌ నుండి వస్తున్న ఈ ప్రతిపాదనను పవన్‌ కళ్యాణ్‌ అంగీకరిస్తే కనుక రాజకీయంగా అదో పెద్ద సంచనలనమవుతుంది.

అసలు పవన్‌, జగన్‌ ఎలా కలుస్తారు.? పవన్‌ కళ్యాణ్‌ వ్యక్తిగత జీవితంపై జగన్‌ చేసిన దుష్ప్రచారం మాటేమిటి.? జగన్‌ మీద పవన్‌ చేసిన అవినీతి ఆరోపణలు అంత తేలిగ్గా మర్చిపోయేవేనా.? అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు దీర్ఘాలు తీస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా. అలాంటి కాంగ్రెస్‌ పార్టీతో తెలుగుదేశం పార్టీ మొన్నటి తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో అంటకాగింది. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌ విడిగా పోటీ చేసినా, జాతీయ స్థాయిలో ఆ రెండు పార్టీల మధ్యా స్నేహం కొనసాగుతుంది. కాబట్టి, పూటకో పార్టీతో పొత్తు పెట్టుకునే తెలుగుదేశం పార్టీకి ఇతర పార్టీల పొత్తుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదనేది ఆ పార్టీని వ్యతిరేకించేవారు చెబుతున్న మాట.

ఇంతకీ పవన్‌, జగన్‌ కలయిక సాధ్యమేనా.? అంటే ఇప్పుడే ఏమీ చెప్పలేం. జనసేన పార్టీకి పదో, పదిహేనో సీట్లు వచ్చి అధికారానికి కొంచెం దూరంలో ఆగిపోతేనే వైఎస్‌ జగన్‌కి పవన్‌తో అవసరం ఏర్పడుతుంది. జనసేనతో పొత్తు కోసం వైసీపీ తరపున ప్రయత్నాలు మొదలయ్యాయంటే, ఎన్నికల ఫలితాలపై వైఎస్‌ జగన్‌ పైకి చెప్పిన ధైర్యపు మాటల వెనుక అంత గందరగోళం ఉందన్న మాట. ఏది ఏమైనా ఎన్నికల ఫలితాల నాటికి, చాలా సమయం ఉన్నందున ధీమా ఒకవైపు, ఆందోళన ఇంకోవైపు ప్రధాన రాజకీయ పార్టీలకు ఉండడం సహజమే.

5 COMMENTS

  1. 330559 815415Im impressed, I ought to say. Genuinely rarely do you encounter a weblog thats both educative and entertaining, and let me let you know, you may have hit the nail about the head. Your concept is outstanding; ab muscles something that too couple of people are speaking intelligently about. Im delighted i located this in my hunt for something about it. 904240

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...