PM Modi: తన సొంత నియోజకవర్గం వారణాసిలో ప్రధాని మోదీ (PM Modi) పర్యాటిస్తున్నారు. ఈక్రమంలో గురువారం రాత్రి కాన్వాయ్ ఆపి మరీ.. నడుచుకుంటూ పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆయనతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.
కొత్తగా నిర్మించిన శివ్ పుర్-ఫుల్వరియా-లహరతారా మార్గ్ ను తనిఖీ చేశారు. దీనిని రూ.360కోట్ల రూపాయలతో చేపట్టారు. బనారస్ హిందూ యూనివర్శిటీ నుంచి వారణాసి ఎయిర్ పోర్టుకు ఈ మార్గం సమయాన్ని తగ్గిస్తుంది. ఆకస్మికంగా మోదీ చేపట్టిన తనిఖీలపై సోషల్ మీడియాలో హర్షం వ్యక్తమవుతోంది. దేశ ప్రధాని ఇలా ప్రత్యక్ష తనిఖీల్లో.. అదీ అర్ధరాత్రి వేళ్ల వెళ్లడం విశేషమని అంటున్నారు.
ఈ తనిఖీలకు ముందు పట్టణంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. పుర ప్రజలు ఆయనను చూసేందుకు రాత్రి వేళలో కూడా భారీగా చేరుకున్నారు. ఆయనపై పూల వర్షం కురిపించారు. నేడు పలు అభివృద్ధి కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు.