Siddarth Roy: సంగీత దర్శకుడు రథన్ (Radhan) చెన్నైలో ఉండి బతికిపోయాడని.. హైదరాబాద్ లో ఉంటే గొడవలేనని నూతన దర్శకుడు యశస్వి మండిపడ్డారు. తన దర్శకత్వంలో అతడు, భద్ర, ఆర్య తదితర చిత్రాల్లో బాలనటుడిగా నటించిన దీపక్ సరోజ్ హీరోగా తెరకెక్కిన ‘సిద్ధార్ద్ రాయ్’ (Siddarth Roy) ప్రీరిలీజ్ ఫంక్షన్లో ఆయన మాట్లాడారు.
‘రథన్ మంచి టెక్నీషియనే కావొచ్చు. కానీ.. అనుకున్న సమయానికి మ్యూజిక్ ఇవ్వడు. ఏదైనా గొడవపడేలా మాట్లాడతాడు. సిద్ధార్ధ్ రాయ్ సినిమా షూటింగ్ త్వరగానే పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ మాత్రం చాలా ఆలస్యమైంది. దీనికి కారణం రధన్. నాలా మరెవరూ మోసపోకూడదనే ఇదంతా చెప్తున్నా. అతని తీరుతో సినిమా కిల్ అయిపోతుంద’ని అన్నారు.
అర్జున్ రెడ్డి విషయంలో కూడా సందీప్ రెడ్డి వంగా ఇదే తరహాలో ఆరోపణలు చేశాడు. పాటలు లేట్ చేయడంతో బ్యాక్ గ్రౌండ్ హర్షవర్ధన్ రామేశ్వర్ తో చేయించినట్టు చెప్పుకొచ్చారు. ఎవడే సుబ్రహ్మణ్యం, అందాల రాక్షసి, జాతిరత్నాలు, హుషారు, మిశ్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలకు రథన్ సంగీతం అందించారు.