చైనాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 123 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది ఉన్నారు. మొత్తంగా 132 మందితో వెళ్తోన్న బోయింగ్ 737 విమానం చైనాలోని గుయాంగ్జి ప్రాంతంలోని వుజౌ నగరానికి సమీపంలో ఉన్న ఓ పర్వతాన్ని ఢీ కొట్టి కూలిపోయింది. చైనా మీడియా కథనాల ప్రకారం..
సోమవారం మధ్యాహ్నం 1.11 గంటల ప్రాంతంలో కున్మింగ్ నగరం నుంచి గుయాంగ్ ఝౌ నగరానికి బయలుదేరిన విమనాం 3.05లకు ల్యాండ్ కావాల్సి ఉండగా 2.22 గంటల సమయంలో రాడార్ తో సంబంధాలు తెగిపోయాయి. ఆ సమయంలో విమానం 3225 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నట్టు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వర్గాలు తెలిపాయి. ఆ వెంటనే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
విషయం తెలుసుకున్న వెంటనే పర్వతంలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశం లేదని అక్కడి మీడియా అంటోంది. ఘటనా స్థలానికి రెస్క్యూ టీమ్ వెళ్లగా.. మృతులు, క్షతగాత్రుల వివరాలు తెలియరాలేదని మీడియా తెలిపింది.
844725 21167Extremely informative and fantastic complex body part of articles , now thats user pleasant (:. 874632
482783 259352Extremely fascinating info !Perfect just what I was seeking for! 421136