Switch to English

బోడి లింగాలు: జగన్‌ సాబ్‌కి వకీల్‌ సాబ్‌ అల్టిమేటం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

‘వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికల్లా ఒక్కో రైతుకీ పంట నష్టం పరిహారం కింద 35 వేల రూపాయల్ని అందించాల్సిందే. లేని పక్షంలో అసెంబ్లీని ముట్టడిస్తాం.. అసెంబ్లీని విజయవాడలో పెట్టుకుంటారో, విశాఖపట్నంలో పెట్టుకుంటారో, పులివెందులలో పెట్టుకుంటారో.. ఎక్కడన్నా పెట్టుకోండి.. మాకేం భయం లేదు.. మేం వెనక్కి తగ్గం, ముట్టడించి తీరతాం. తక్షణం 10 వేల సాయం రైతులకు అందించాలి..’ అంటూ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, జగన్‌ సర్కార్‌కీ అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అల్టిమేటం జారీ చేశారు.

‘చాలామంది నానీలు వున్నారు.. ఏ నాని గురించి మాట్లాడతాం.? ఎవరో ఒకరు, నన్ను తిట్టడానికి అందరూ వచ్చేస్తారు. నన్ను బూతులు తిట్టుకోండి, నాకేం నష్టం లేదు. రైతులకు సాయం చేయండి. శతకోటి లింగాల్లో బోడి లింగం.. అన్నట్టు, చాలామంది నానిల్లో ఎవరో ఒకరు. మీ సీఎం జగన్‌ సాబ్‌కి చెప్పుకోండి.. ఇది వకీల్‌ సాబ్‌ హెచ్చరిక అని..’ అంటూ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, పవర్‌ పంచ్‌ పేల్చారు.

నివర్‌ తుపాను, భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో పలు జిల్లాల్లో రైతాంగం తీవ్రంగా నష్టపోయిన విషయం విదితమే. రైతుల వెతల్ని, పంట నష్టాన్ని పంట పొలాల్లోకి దిగి మరీ ఇటీవల పరిశీలంచిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, రైతులకు 35 వేల చొప్పున సాయం చేయాలని గతంలోనే డిమాండ్‌ చేశారు. అయితే, తన డిమాండ్‌కి ప్రభుత్వం స్పందించని కారణంగా, ఈ రోజు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కృష్ణా జిల్లా కలెక్టర్‌ని కలిసి వినతి పత్రం అందించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో కలెక్టర్లను జనసేన ముఖ్య నేతలు కలిసి ఇదే విషయమై వినతి పత్రాల్ని అందించారు.

కృష్ణా జిల్లా పర్యటన సందర్భంగా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డారు జనసేనాని. ‘నన్ను తిడితే తప్ప మీ పదవి వుండదని మీరు భావిస్తే, తిట్టుకోండి.. నాకేం అభ్యంతరం లేదు..’ అంటూ పరోక్షంగా మంత్రి పేర్ని నానిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు జనసేనాని. ఇంకేముంది, వైసీపీ నుంచి మంత్రి పేర్ని నాని సహా, మిగతా నానిలు.. ఇతర వైసీపీ నేతలు (మరీ ముఖ్యంగా ఓ సామాజిక వర్గానికి చెందిన నేతలు) ఇప్పటికే పవన్‌ కళ్యాణ్‌ని తిట్టేందుకు రెడీగా వుంటారనుకోండి.. అది వేరే సంగతి.

తిడితే తిట్టారు.. రైతుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొస్తే, జనసేనాని ప్రయత్నం ఫలించినట్లే. ఇక, అసెంబ్లీ ముట్టడి అంటారా.. జనసేనాని అక్కడిదాకా వెళితే, ఆపేందుకు రాష్ట్రంలో బహుశా ఏ శక్తీ సరిపోదేమో.!

5 COMMENTS

  1. 613239 601042His or her shape of unrealistic tats were initially threatening. Lindsay utilized gun very first basic, whereas this girl snuck outside by printer ink dog pen. I used absolutely confident the all truly on the shade, with the tattoo can be taken from the body shape. make an own temporary tattoo 316859

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...