Switch to English

పవన్‌ కళ్యాణ్.. ముచ్చటగా మూడు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌, రాజకీయాల నుంచి కొంత విరామం కోరుకుంటున్నారా? ఈ ప్రశ్నకి ఔననే సమాధానం వినిపిస్తోంది సినీ, రాజకీయ వర్గాల్లో. జనసేన అంతర్గత విశ్లేషణల్లోనే ఆ పార్టీ గట్టిగా 40 స్థానాల్లో కూడా పోటీ ఇవ్వలేకపోయిందంటూ సోషల్‌ మీడియా వేదికగా పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న దరిమిలా, వాస్తవ ఫలితాలు ఎలా వుంటాయో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. అధికారమే లక్ష్యం కాదంటూ ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత స్పష్టం చేశారు. కానీ, మెరుగైన పాలన కోసం జనసేనకు ఓటేయాలని పవన్‌ పిలుపునిచ్చిన మాట వాస్తవం.

మే 23న ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. ప్రస్తుతం జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌, హైద్రాబాద్‌లో వున్నారు. పలువురు సినీ ప్రముఖులతో మంతనాలు కూడా జరుపుతున్నారట. ఆ మంతనాలు కూడా సినిమాల గురించేనని సమాచారమ్‌. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై పవన్‌కళ్యాణ్‌ గతంలో ఓ సినిమా చేయాల్సి వుంది. అప్పట్లో అడ్వాన్స్‌ కూడా తీసుకున్నారు పవన్‌కళ్యాణ్‌. ఆ ప్రాజెక్ట్‌ ఇప్పుడు పట్టాలెక్కేలా వుందన్న వార్త వెలుగులోకి వచ్చింది. అదే నిజమైతే, దర్శకుడెవరన్నది మరో సస్పెన్స్‌. పవన్‌కళ్యాణ్‌ సీన్‌లోకి దిగితే, దర్శకుడు దొరక్కపోవడమంటూ వుండదు.

ఇంకో వైపు నిర్మాత రామ్‌ తాళ్ళూరి కూడా పవన్‌కళ్యాణ్‌తో సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన, ఇప్పటికే కొందరు దర్శకులతో పవన్‌ హీరోగా సినిమా విషయమై చర్చలు జరిపారు, కొన్ని కథల్ని కూడా ఆయన సమకూర్చుకున్నారట. అంటే, ఇక్కడికి రెండు సినిమాలు పవన్‌కళ్యాణ్‌ కోసం సిద్ధంగా వున్నట్టు లెక్క. మరో సినిమా కూడా లైన్‌లోనే వుంది. అదే త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో పవన్‌కళ్యాణ్‌ హీరోగా సినిమా. ఇది కొంత రాజకీయ నేపథ్యంలో వుండబోతోందిట. ‘అజ్ఞాతవాసి’ సినిమా ఘనవిజయం సాధించి వుంటే, త్రివిక్రమ్‌ – పవన్‌ కళ్యాణ్‌ కాంబినేషన్‌లో ఇంకో సినిమా పట్టాలెక్కి వుండేదే.

పై మూడు ప్రాజెక్టులు కాకుండా ఇంకో రెండు ప్రాజెక్టులకు సంబంధించి కూడా రకరకాల ఊహాగానాలున్నాయి. ఇవి ఉత్త ఊహాగానాలు మాత్రమే కాదు, పవన్‌కళ్యాణ్‌ తనంతట తానుగా కొన్ని కమిట్‌మెంట్స్‌ ఇచ్చినవని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ కమిట్‌మెంట్స్‌ నేపథ్యంలో అడ్వాన్సులు కూడా తీసుకున్నారనీ, వాటినే ఎన్నికల అఫిడవిట్‌లో అప్పులుగా పవన్‌ చూపించారనీ రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సినీ వర్గాల్లో. పవన్‌ కళ్యాణ్‌తో సినిమా నిర్మించే అవకాశమొస్తే, దాన్ని ఎవరూ వదులుకునేందుకు సిద్ధపడరు. ఆయన సినిమాలకు జరిగే ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ అలా వుంటుంది.

రాజకీయాల్లో తాను అనుకున్నది సాధించలేక, తిరిగి సినిమాల్లోకి వచ్చిన చిరంజీవి ‘ఖైదీ నెంబర్‌ 150’ సినిమాతో సాధించిన సంచలన విజయాన్ని ఉదహరిస్తూ, పవన్‌కళ్యాణ్‌ కూడా అదే బాటలో పయనిస్తాడని కొందరు అంచనా వేస్తున్నారు. అయితే తాను వేరు, తన తమ్ముడు వేరని ఇప్పటికే చిరంజీవి స్పష్టతనిచ్చారు. సినిమాలు – రాజకీయాల్ని పవన్‌ బ్యాలన్స్‌ చేయగలడన్న గట్టి నమ్మకాన్ని చిరంజీవి గతంలో వ్యక్తం చేశారు. అది వాస్తవమేనా? పవన్‌ కళ్యాణ్‌ అటు రాజకీయాల్ని, ఇటు సినిమాల్ని కూడా సమర్థవంతంగా డీల్‌ చేయగలడా? అంటే, దానికి కాలమే సమాధానం చెప్పాల్సి వుంటుంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...