చిరంజీవి హీరోగా రూపొందిన ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’ సినిమాలో ఓ పాటలో చిరంజీవి తళుక్కున మెరుస్తారు. కొద్ది సెకెన్ల పాటు మాత్రమే కన్పిస్తాడు పవన్ కళ్యాణ్ ఆ సినిమాలో. ఆ తర్వాత ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాలో మాత్రం అన్నయ్య చిరంజీవి కోసం ఓ ఫైట్ చేసేస్తాడు కూడా. అన్నయ్య చిరంజీవి సినిమాలకు పవన్ కళ్యాణ్ పనిచేయడం కొత్తేమీ కాదు. ‘డాడీ’ సినిమా కోసం అయితే ఏకంగా ఓ యాక్షన్ సీక్వెన్స్‌ని పవన్ డిసైన్ చేసేశాడు స్టంట్ కొరియోగ్రాఫర్‌గా.
ఇక, ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవి నటిస్తోన్న ‘సైరా నరసింహారెడ్డి’కి వాయిస్ ఓవర్ అందించడం గమనార్హం. ఈ నెల 20న విడుదల కాబోతోన్న ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్లో పవన్ కళ్యాణ్ వాయిస్ వినిపించబోతోంది. అలా పవన్, టీజర్ కోసం వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు, పక్కనే వున్న చిరంజీవి తన తమ్ముడి వాయిస్ ఓవర్ ఇస్తోంటే చూసి భావోద్వేగానికి గురయ్యాడట. స్వాతంత్య్ర సమరయోధుల ప్రస్తావన వస్తే, పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో ఉద్వేగానికి లోనవుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అలాంటిది, తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ‘సైరా నరసింహారెడ్డి’ విషయంలో ఇంకెంత ఉద్వేగానికి గురయి వుండాలి. అదీ, అన్నయ్య పక్కన వున్నప్పుడే వాయిస్ అందించిన పవన్, ఈ సినిమాకి ఇంకెంత హైప్ తెచ్చి వుండాలి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ అక్టోబర్ 2న విడుదల కానున్న సంగతి తెల్సిందే.
579167 181981Thank you for your data and respond to you. auto loans westvirginia 442320
774698 835841this is quite interesting. thanks for that. we want much more web sites like this. i commend you on your wonderful content material and superb subject choices. 555181