ఒకప్పుడు మీడియా రంగంలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్, ఇప్పుడు బెయిల్ కోసం నానా తంటాలూ పడాల్సి వస్తోంది. టీవీ9 యాజమాన్య మార్పు సమయంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారంటూ రవిప్రకాష్‌పై కేసులు నమోదయిన విషయం విదితమే. ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే ఆయన అరెస్ట్ అయ్యారు. బెయిల్ దొరకడం కష్టంగా మారిన పరిస్థితుల్లో రవిప్రకాష్ మీద కొత్తగా మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.
తాజాగా ఆయనపై ‘ఫేక్ ఐడీ’ కేసు నమోదయ్యింది. ఐ ల్యాబ్ పేరుతో నటరాజన్ అనే వ్యక్తి పేరు మీద ఫేక్ ఐడీ కార్డుని రవిప్రకాష్ క్రియేట్ చేశారన్నది ఆయనపై మోపబడ్డ తాజా అభియోగం. ఈ కేసు విచారణ నిమిత్తం రవిప్రకాష్‌ని జైలు నుంచి, న్యాయస్థానానికి తరలించినట్లు తెలుస్తోంది. తవ్వి తీస్తే రవిప్రకాష్ అక్రమాలు మరిన్ని వెలుగులోకి రాబోతున్నాయనీ, పెద్ద సంఖ్యలో రవిప్రకాష్ బాధితులు తెలుగు రాష్ట్రాలతోపాటు పొరుగు రాష్ట్రాల్లోనూ వున్నారనే వాదనలు విన్పిస్తున్నాయి.
మరోపక్క, ఇవన్నీ రవిప్రకాష్ మీద కుట్రపూరితంగా నమోదవుతున్న కేసులంటూ సోషల్ మీడియాలో రవిప్రకాష్ తరఫున కొందరు వకాల్తా పుచ్చుకుంటుండడం గమనార్మం. ఏదిఏమైనా, కేసుల తీవ్రత దృష్ట్యా రవిప్రకాష్ ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశాలు కన్పించడంలేదనీ, ముందు ముందు ఆయన మరింతగా లీగల్ చిక్కుల్లో ఇరుక్కుపోవడం ఖాయమని న్యాయ నిపుణలు అభిప్రాయపడుతున్నారు.
రవిప్రకాష్ అంటే తెలుగు న్యూస్ ఛానల్స్ రంగంలో ఒకప్పుడు ఓ సంచలనం. ఇప్పుడు కూడా సంచలనమే.. కానీ, వేరే కారణాలతో. వివిధ రాజకీయ పార్టీలతో రవిప్రకాష్ సన్నిహితులు సంప్రదింపులు జరుపుతూ, ఆయన్ని గట్టున పడేసేందుకు ప్రయత్నిస్తున్నా.. ఆ ప్రయత్నాలేవీ సఫలం కావడంలేదట.
527237 896673I want to start a weblog but would like to own the domain. Any suggestions how to go about this?. 437061
281853 133682Often the Are generally Weight reduction program is unquestionably an low-priced and flexible weight-reduction program product modeled on individuals seeking out shed some pounds combined with at some point preserve a far healthier your life. la weight loss 328610