యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సినిమాల లైనప్ విషయంలో ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు. వరస విజయాలతో ఊపు మీదున్న ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ అక్టోబర్ మొదటి వారంలో తిరిగి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తయింది. ఆర్ ఆర్ ఆర్ పూర్తైన వెంటనే ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించనున్నాడు. ఇదొక రాజకీయ నేపథ్యంలో సాగే ఎంటర్టైనింగ్ కథాంశం.
త్రివిక్రమ్ సినిమా పూర్తైన తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ ను సెట్ చేసాడు. ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించకపోయినా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఇన్ డైరెక్ట్ గా ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి ఇంకా సంవత్సరానికి పైగా సమయం ఉంది. 2021 ఎండింగ్ లోనే ఈ సినిమాను పట్టాలెక్కించనున్నారు.
అయితే ఈ సినిమా స్టోరీ లైన్ ఇదే అంటూ ఇప్పుడు ఒక వెర్షన్ బయటకు వచ్చింది. దాని ప్రకారం ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ బయో వార్ నేపథ్యంలో సాగుతుందట. ఇందులో ఎన్టీఆర్ పూర్తి నెగటివ్ రోల్ లో కనిపిస్తాడని సమాచారం. దాదాపు 300 కోట్లతో ఈ చిత్రాన్ని రూపొందించాలని ప్రాధమికంగా అనుకుంటున్నారు.
427315 229705Cool text dude, maintain up the good function, just shared this with the mates 443154
536717 437629i was just browsing along and came upon your site. just wantd to say excellent job and this post really helped me. 512558
774417 344786Maintain websiteing stuff like this I truly am fond of it 853059
151306 114907You created some decent points there. I looked online for that dilemma and found most people goes coupled with with all your web site. 294157
702993 427984This internet website could be a walk-through its the data you wanted in regards to this and didnt know who need to. Glimpse here, and youll definitely discover it. 52141