Switch to English

ఓటుకు నోటు.. ఇదే పార్టీల రూటు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కీలకమైన ఆఖరి ఘట్టానికి తెర లేచింది. మరికొద్ది గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ప్రచారం పూర్తిచేసుకున్న పార్టీలు తదుపరి చర్యలకు ఉపక్రమించాయి. ఓటుకు నోటు చెల్లించేశాయి. అన్ని పార్టీలూ ఇదే రూటులో పయనించాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో డబ్బుల పంపిణీ దిగ్విజయంగా పూర్తయింది. ఓటుకు ఒక్కో చోట ఒక్కో రేటు పలికింది. అత్యధికంగా మంగళగిరి ఓటర్లకు గిట్టుబాటు అయినట్టు సమాచారం.

రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో అభ్యర్థులు పోటీపడి మరీ డబ్బులు పంచేశారు. ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు అందజేశారు. ఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పుల ఆధారంగా ఎన్ని ఓట్లు ఉంటే అంత మేర లెక్క కట్టి చెల్లించేశారు. అక్కడక్కడా కొంతమంది నిర్ద్వందంగా తమకు అలాంటి డబ్బు అవసరం లేదని చెప్పగా.. చాలామంది ఇచ్చిన ప్రతి పార్టీ దగ్గరా డబ్బులు తీసుకున్నారు. డబ్బు పంపిణీలో అధికార తెలుగుదేశం పార్టీతో ప్రత్యర్ధి పార్టీలు తూగలేకపోయాయి.

అన్ని పార్టీలూ డబ్బులు పంపిణీ చేసినప్పటికీ, అధిక మొత్తం మాత్రం తెలుగుదేశం పార్టీయే చెల్లించింది. వైఎస్సార్ సీపీ అభ్యర్థులు రూ.వెయ్యి పంచినచోట తెలుగుదేశం పార్టీ రూ.1500 అందజేసింది. వైఎస్సార్ సీపీ రూ.1500 ఇస్తే, తెలుగుదేశం పార్టీ రూ.2వేలు చెల్లించింది. కొన్నిచోట్ల మహిళలకు చీరలు, ఫోన్లు పంచినట్టు సమాచారం. డబ్బులు లేకుండా రాజకీయాలు చేయలేమా అంటూ ప్రశ్నించిన జనసేన కూడా డబ్బు పంపిణీ చేయడం గమనార్హం.

అయితే, ఆ పార్టీకి పరిమితి ఆర్థిక వనరులు మాత్రమే ఉండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులతో ఈ విషయంలో పోటీపడలేకపోయినట్టు సమాచారం. అందుకే రూ.500 వరకు ఆ పార్టీ చెల్లించినట్టు చెబుతున్నారు. కాగా, డబ్బుల పంపిణీలో పార్టీలు వినూత్న పద్ధతులు అవలంభించాయి. పెద్దగా సమస్యలేని చోట్ల నేరుగా ఇళ్లకే వెళ్లి, ఆ ఇంట్లో ఓట్ల సంఖ్యను బట్టి నగదు అందజేయగా.. కొన్నిచోట్ల ఓటరు స్లిప్పులతోపాటు కూపన్లు పంచిపెట్టారు. అనంతరం వాటిని తీసుకుని వారు నిర్దేశించిన ప్రాంతానికి వెళ్లినవారికి నగదు ముట్టజెప్పారు.

అత్యధికంగా మంగళగిరి నియోజకవర్గంలో పంపిణీ జరిగిందని అంటున్నారు.అక్కడ సీఎం తనయుడు నారా లోకేశ్ పోటీలో ఉన్న నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గాన్ని టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముందు నుంచి పక్కా వ్యూహం ప్రకారమే అక్కడ ముందుకెళ్లింది. ఓట్లు వేయించగల చోటా నేతలకు ముందుగానే గాలం వేసింది. వారికి పెద్ద మొత్తంలో తాయిలాలు ముట్టజెప్పి తనవైపు తిప్పుకుంది. అనంతరం వారి ద్వారా తతంగం నడిపించినట్టు సమాచారం. ఓటుకు ఏకంగా రూ.5 వేల వరకు ఇచ్చిందని అంటున్నారు. కొంతమందికి వస్తు రూపేణా అందజేసినట్టు చెబుతున్నారు. ఐదు ఓట్లు ఉన్న ఇంటికి ఎల్ఈడీ టీవీ లేదా ఫ్రిజ్ వంటి ఉత్పత్తులు ఇచ్చారని తెలిసింది. ఇందుకోసం ప్రత్యేక కూపన్లు ఇచ్చారు. వాటిని తీసుకుని తాడేపల్లిలోని ఓ షోరూంలో ఇస్తే, సదరు వస్తువు ఇచ్చే ఏర్పాటు చేశారని అంటున్నారు.

ఇప్పటికే చాలాచోట్ల తాయిలాల పంపిణీ పూర్తికాగా, మిగిలిన ప్రాంతాల్లో బుధవారం రాత్రి ఈ తతంగం పూర్తి చేయడానికి రంగం సిద్దం చేసుకున్నారు. ఓటర్లు మాత్రం పక్కా క్లారిటీతో ఉన్నారు. అన్ని పార్టీల దగ్గరా సొమ్ము తీసుకున్నప్పటికీ, చివరకు తమకు నచ్చిన పార్టీకే ఓటు వేయాలని డిసైడ్ అయిపోయారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...