Switch to English

నార్త్ వర్సెస్ సౌత్: ఈ ‘హిందీ’ రగడ ఏంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

హిందీ జాతీయ భాషలా చెలామణీ అవుతోంది. అది జాతీయ భాషేనా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల నుంచి హిందీ విషయమై వ్యతిరేకత వున్న మాట వాస్తవం. బలవంతంగా హిందీని తమపై రుద్దడాన్ని దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కానీ, ఆ హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నమైతే ప్రస్తుత నరేంద్ర మోడీ సర్కారు అవలంబిస్తోంది.

దేశంలో మెజార్టీ ప్రజానీకానికి అర్థమయ్యే భాష హిందీ. అలాగని, దాన్ని తప్పనిసరి భాషగా మార్చాలనే ప్రయత్నం మాత్రం సబబు కాదన్నది రాజకీయ విశ్లేషకుల వాదన. సరే, ఎవరి గోల వారిది. ఇప్పుడీ హిందీ రగడ, సినీ రంగంలో చిచ్చుపెడుతోంది.

‘మనది ఇండియన్ సినిమా..’ అంటూ ‘బాహుబలి’ తర్వాత బాలీవుడ్ సినీ జనం గట్టిగా నినదిస్తున్నారు. వాస్తవానికి ఈ భావన ఇప్పటిది కాదు. సౌత్ సినిమా ఎప్పటినుంచో ఇదే మాట చెబుతోంది. అయితే, సౌత్ సినిమాని బాలీవుడ్ సినీ జనం అవమానిస్తూనే వున్నారు.

ఇటీవల ఓ సినీ వేడుకలో కన్నడ సినీ నటుడు సుదీప్ మాట్లాడుతూ, ‘హిందీ జాతీయ భాష కాదు.. బాలీవుడ్, ఇప్పుడు కొత్తగా పాన్ ఇండియా సినిమాలంటోంది.. కానీ, బాలీవుడ్ తీసే పాన్ ఇండియా సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి. దక్షిణాది సినిమా అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది..’ అంటూ వ్యాఖ్యానించాడు.

దాంతో, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ నొచ్చుకున్నాడు.. సుదీప్‌కి ట్విట్టర్ వేదికగా క్లాస్ పీకేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో హిందీలో ట్వీటేశాడు అజయ్ దేవగన్. ‘మీరు వేసిన హిందీ ట్వీటుని నేను అర్థం చేసుకోగలను. కానీ, నేను కన్నడలో స్పందిస్తే మీకు అర్థమవుతుందా.?’ అని ప్రశ్నించాడు సుదీప్.

దాంతో, ఇంగ్లీషులో అజయ్ దేవగన్ మరో ట్వీటు వేయాల్సి వచ్చింది. పాన్ ఇండియా సినిమా తీసే సౌత్ సినీ ప్రముఖులు, తమ సినిమాల్ని నార్త్ బెల్ట్‌లో ప్రమోట్ చేసుకునేందుకు చాలా కష్టపడుతున్నారు. కానీ, ఆ స్థాయిలో బాలీవుడ్ సినీ ప్రముఖులు దక్షిణాదిలో ప్రమోట్ చేసుకోవడంలేదు. ఇదీ తేడా. సినిమా అంటే దానికి ప్రాంతీయత అంటగట్టడం సబబు కాదు. ఈ రచ్చ కూడా అనవసరం. బాలీవుడ్ సినిమా మాత్రం, సౌత్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా వుంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...