Switch to English

కొత్త జోడి ‘జబర్దస్త్‌’గా ఉంటుందా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

తెలుగు టీవీ చరిత్రలో చాలా ప్రోగ్రామ్స్‌ ఒక రకమైన చరిత్రే సృష్టించాయి. నేటి వరకు అలాంటి హైయెస్ట్‌ రేటెడ్‌ ప్రోగ్రామ్స్‌లో ముందువరసలో ఉండేది జబర్దస్త్‌ కార్యక్రమమే. ఈటీవీతోపాటు ఈనాడు గ్రూప్‌లో ప్రసారమయ్యే అన్నికార్యక్రమాల్లో మడికట్టుకునే పనిచేసేవారు. సిద్ధాంతాలు అనిచెప్పి లేడీ యాంకర్లతో చీరలకు కట్టించి మరీ వార్తలు చదివిస్తున్నారు. అంత గొప్ప ఈనాడు గ్రూపులో ప్రసారమయ్యే జబర్దస్త్‌ కామెడీ షో మాత్రం మడిని పక్కనపెట్టి పూర్తి మాస్‌, మసాలా ఎంటర్‌టైనర్‌గా ఎదిగింది. మోతాదును మించిన బూతు కామెడీతో భారీ సంఖ్యలోనే అభిమానులను అలరించింది. మొదట్లో ఈటీవీలో ఇలాంటి కార్యక్రమాలా? అని ముక్కున వేలేసుకున్న చాలామంది.. ఆ తర్వాత జబర్దస్త్‌ వీడియోలను యూట్యూబ్‌లో చూస్తూ కడుపారా నవ్వుకునే పరిస్థితిని మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ కల్పించింది.

ఈ కార్యక్రమంలో ఆర్టిస్టుల స్కిట్‌లకు జడ్జీలైన నాగబాబు, రోజాల కామెంట్లు.. కడుపారా నవ్వడాలు అదనపు అట్రాక్షన్‌. ఇందులో ఏమాత్రం డౌట్‌ అవసరం లేదు. అప్పుడప్పుడు వీరిద్దరిపై స్కిట్లలో జోకులు పేలినా.. లైట్‌ తీసుకుని ప్రోగ్రామ్‌ను ఎంటర్‌టైనర్‌గా మార్చారు. అనుసూయ, రష్మిల యాంకరింగ్‌ కూడా ఈ ప్రోగ్రానికి యాడెట్‌ అడ్వాంటేజ్‌. కుళ్లు జోకులే ఎక్కువగా ఉ‍న్నప్పటికీ.. టీవీ రేటింగ్స్‌లో ఆ తర్వాత యూట్యూబ్‌ ఆదాయంలో జబర్దస్త్‌ నిజంగానే జబర్తస్త్‌ కలెక్షన్లు తెచ్చిపెడుతోంది. ఈ క్రెడిట్‌ అంతా మొత్తం జబర్దస్త్‌కోసం పనిచేస్తున్న అందరి టీమ్‌ ఎఫర్ట్‌.

ఇప్పుడా టీమ్‌నుంచి నాగబాబు, రోజా శాశ్వతంగా విడిపోయే అవకాశముంది. ఇన్నాళ్లు షో రక్తికట్టేందుకు కారణమైన ఈ ఇద్దరు ఎన్నికల ప్రచారం సందర్భంగా షూటింగ్‌ షెడ్యూల్‌కు రావడం లేదు. పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ పిలుపుతో.. నాగబాబు ప్రత్యక్ష రాజకీయ గోదాలోకి దిగారు. నరసాపురం ఎంపీగా పోటీ చేస్తు‍న్నారు. అటువైపు రోజా మొదట్నుంచీ వైయస్సార్‌సీపీలో క్రియాశీలకంగానే ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇంకా బిజీ అయ్యారు. ఏపీలో వైయస్సార్‌సీపీ గెలిచేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో ఆమె గెలిస్తే మంత్రి పదవి ఖాయమే. దీంతో ఇక రెగ్యులర్‌గా షెడ్యూల్‌కు అనుగుణంగా షూటింగ్‌కు రావడం కష్టమే.

నాగబాబు కూడా సామాజిక సమీకరణాలు కలిసొస్తే నరసాపురం నుంచి ఎంపీ అవ్వడం ఖాయమే. ఒకవేళ ఆయన గెలవకపోయి.. జనసేన వ్యవహారాల్లో చురుకుగా పాలుపంచుకోనున్నారని సమాచారం. దీంతో వీరిద్దరు జబ్బర్దస్త్‌కు తిరిగిరావడం కష్టమేననే చర్చ జరుగుతోంది. దీంతో వీరి స్థానంలో కొత్త జడ్జీలు ఎంట్రీ ఇచ్చారు. సెలవుపై వెళ్లి మళ్లీ షోలో జాయిన్‌ అవుతారని అప్పటివరకు వీరి స్థానంలో శేఖర్‌ మాస్టర్‌, నిన్నటితరం నటి మీనాలు జడ్జీలుగా ఉంటారని అనుకున్నా.. పైకారణాలతో పాత జడ్జీలు మళ్లీ తిరిగిరావడం ఇక డౌటేననిపిస్తోంది.

రోజా స్థానంలో మీనాను రంగంలోకి దించారు. అయితే ‍కుటుంబకథానాయకిగా ప్రజలను ఆకట్టుకున్న మీనా.. సినిమాల్లో కామెడీ సీన్లలోనే మనసారా నవ్వలేదు. దీనికితోడు పచ్చిబూతు డైలాగులు ప్రవహించే జబర్దస్త్‌లో కుల్లుజోకులతో మీనా తన పాత్రకు న్యాయం చేయగలరా అనేది డౌటనుమానం. దీనికితోడు.. శేఖర్‌ మాస్టర్‌ కూడా కడుపారా నవ్విన సందర్భాలు టీవీ స్క్రీన్‌పై తక్కువగానే కనిపించాయి. మరి ఆయన ఏమేరకు తన ‘స్కిట్‌’ (స్క్రీన్‌పై నవ్వడం కూడా యాక్టింగే కదా) కు న్యాయం చేస్తారో లేదో చూడాలి. అసలు ఇంట్రెస్టింగ్‌ ట్విస్ట్‌ ఏంటంటే.. జబర్దస్త్ షోకు ఒప్పుకున్నందుకు గానూ.. శేఖర్ మాస్టర్, మీనాలకు వారు ఇప్పటి వరకు ఏ టీవీ షోకు ఇవ్వనంత భారీ రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. కొన్ని ఎపిసోడ్లు గడిస్తే గానీ వీరి పెర్ఫార్మెన్స్‌పై జనాలకు ఓ అంచనా రాదు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...