Nayanthara: స్టార్ హీరోయిన్ నయనతార (Nayanthara) కు ఆమె భర్త ఖరీదైన బహుమతి అందించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నయనతార పంచుకున్నారు. భర్త ఇచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్ కు థ్యాంక్స్ చెప్పారు. నవంబర్ 18న నయనతార పుట్టినరోజు కావడంతో.. ఇప్పుడు ఈ బహుమతి ఇచ్చారు విఘ్నేశ్ శివన్ (Vignesh Sivan). ఇంతకీ నయనతారకు ఇచ్చిన బహుమతి ఏంటంటే.. ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ మే బ్యాక్ కారును గిఫ్ట్ గా ఇచ్చారు. కారును చూపకుండా లోగోను మాత్రం పోస్ల్ చేసి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.
ఈ కారు ఖరీదు రూ.3కోట్లు పైగా ఉంటుందని తెలుస్తోంది. దీంతో నయనతారకు ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెప్తున్నారు. కెరీర్ పరంగా నయనతార ఇటివలే జవాన్ తో భారీ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆమె తన 75వ సినిమాగా “అన్నపూరణి” సినిమా చేస్తున్నారు. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి ఇండియన్ బెస్ట్ చెఫ్ గా ఎదగాలనుకున్న కలను ఎలా సాకారం చేసుకుందనే కథాంశంతో తెరకెక్కనుంది. ‘టెస్ట్’లో కీలకపాత్ర పోషిస్తున్నారు.
View this post on Instagram