తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ట్విట్టర్లో విజృంభిస్తున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించే ఏ ఒక్క అవకాశాన్నీ ఆయన వదిలిపెట్టడంలేదు. సూటిగా, సుత్తి లేకుండా చాలా పదునైన ప్రశ్నలతో వైఎస్సార్ సీపీ నేతలను, ఏపీ సీఎం జగన్ ను ఇరుకున పెడుతున్నారు. నిన్న తన మావయ్య బాలకృష్ణపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టిన లోకేశ్.. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
బందరు పోర్టు నిర్మాణ బాధ్యతలు తెలంగాణకు అప్పగిస్తే లాభమే తప్ప నష్టం లేదంటూ ఓ పత్రికలో వచ్చి కథనాన్ని ప్రస్తావించిన ఆయన.. ఈ వ్యవహారంలో జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈరోజు చేతకాక బందరు పోర్టును తెలంగాణకు అప్పగిస్తామంటున్నారు. రేపు పాలన కూడా చేతకావట్లేదని రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడతారా? ఇలాంటి అసమర్థులు ఒక్క ఛాన్స్ ఎందుకోసం అడిగారు? దోచుకోడానికా? ప్రజల భవిష్యత్తును పక్క రాష్ట్రాలకు తాకట్టుపెట్టడానికా’’ అని ప్రశ్నించారు.
తెలంగాణ, ఏపీ మధ్య సత్సంబంధాల నేపథ్యంలో బందరు పోర్టును తెలంగాణకు అప్పగించే అవకాశాలున్నాయంటూ చర్చ జరుగుతోందని ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది. దీనిపై విపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించగా.. అలాంటి ప్రతిపాదన ఏమీ లేదని సర్కారు స్పష్టం చేసిందని, కానీ ఈ ప్రతిపాదన వల్ల లాభం తప్ప నష్టం లేదని పలు సామాజిక సంఘాల ప్రతినిధులు చెబుతున్నట్టు వివరించింది.
‘‘ప్రస్తుతం మచిలీపట్నం రేవు నిర్మాణం ముందుకు సాగడంలేదు. మరోవైపు ఈ రేవు ఆవశ్యకత తెలంగాణకు చాలా ఉంది. పైగా ఇప్పటికిప్పుడు పెట్టుబడి పెట్టగల సామర్థ్యం కూడా ఆ రాష్ట్రానికే ఉంది. బందరు రేవు నిర్మాణాన్ని తెలంగాణకు అప్పగిస్తే ఆంధ్రాలో మరో అద్భుతమైన పోర్టు అందుబాటులోకి వస్తుంది. అంతేకాకుండా స్థానికులకే పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రేవు ఆధారంగా బందరు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ చోటు చేసుకుంటుంది’’ అని ఆ పత్రిక పేర్కొంది.
దీనిపై లోకేశ్ తీవ్రంగా స్పందించారు. వాస్తవానికి ఎన్నికల ప్రచారంలో సైతం లోకేశ్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. బందరు పోర్టును తెలంగాణకు తీసుకెళ్లిపోయే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను సరిగా అర్థం చేసుకోలేకపోవడంతో అప్పట్లో ఆయనపై విమర్శలు చేశారు.
365858 711647I think other site proprietors ought to take this website as an model, extremely clean and excellent user friendly style and style, as properly as the content. You are an expert in this topic! 18436
132900 187316very good put up, i surely love this web site, carry on it 370210
575679 12147I actually enjoyed your remarkable web site. Be positive to maintain it up. Could god bless you !!!! 136930