అరరె.! ఆదిరెడ్డి కాస్తా సోదిరెడ్డి అనిపించేసుకున్నాడే.! ఔను, ఆదిరెడ్డిని ‘సోదిరెడ్డి’ అని బిగ్ బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జున నిరూపించేశాడు. ‘అమ్మాయిలు వీక్’ అని రేవంత్ ఓ సందర్భంలో అన్నాడన్నది ఆదిరెడ్డి అభియోగం. అవకాశం కుదిరినా, కుదరకపోయినా.. రేవంత్‌ని టార్గెట్ చేయడానికి ఆదిరెడ్డి తరచూ వాడే మాట అదే.!
బిగ్ బాస్ విశ్లేషకుడ్ని గనుక, తాను హోస్ట్ కంటే గొప్ప.. అనే తలపొగరుతో వ్యవహరిస్తుంటాడు ఆదిరెడ్డి అనే భావన షో మొదలైనప్పటినుంచీ ఆడియన్స్‌లో కలుగుతూనే వుంది. దానికి న్యాయం చేస్తూ వెళుతున్నాడు ఆదిరెడ్డి.
అయితే, ఆదిరెడ్డి గాలి తీసేశాడు నాగార్జున. ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి అన్ కట్ వీడియోను ప్లే చేసి చూపించాడు కింగ్. అంతే, ఆదిరెడ్డికి మైండ్ బ్లాంక్ అయిపోయింది. హౌస్ మేట్స్‌లో ఎవరూ రేవంత్ ‘ఆడవాళ్ళు వీక్’ అన్నాడని తేల్చలేదు. అలా అనలేదనే అందరికీ అర్థమయ్యింది.
ఆడియన్స్ కూడా అదే విషయాన్ని చెప్పడంతో, ఒక్కసారిగా ఆదిరెడ్డికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ‘రేవంత్ అలా అన్నాడని నేను అనలేదు.. రేవంత్ ఉద్దేశ్యం మాత్రం అదే..’ అంటూ ఆదిరెడ్డి మళ్ళీ పాత పాటే పాడాడు. అసలు రేవంత్ ఏం ఒప్పుకోవాలన్నది నీ ఉద్దేశ్యం.? అని నిలదీసిన నాగార్జున, ‘ఇక్కడితో ఆపెయ్.. నిన్ను నువ్వు ఇంకా తగ్గించుకోకు.. నాన్సెన్స్ మాట్లాడుతున్నావ్ ఆదిరెడ్డీ..’ అంటూ క్లాస్ పీకాడు నాగ్.
దాంతో, అక్కడికి ఆ వివాదానికి ఫుల్స్టాప్ పడినట్లయ్యింది. కాగా, బెస్ట్ కెప్టెన్ అవార్డ్ ఇనాయా గెల్చుకుంటే, వరస్ట్ కెప్టెన్‌గా ఆదిరెడ్డి ఎంపికయ్యాడు.. హౌస్ మేట్స్ మెజార్టీ అభిప్రాయం వమేరకు.
ఇక, రేవంత్ తన కూతుర్ని బిగ్ బాస్ టీవీ ద్వారా చూసుకోగలిగాడు. రేవంత్ భార్య అన్విత తన కుమార్తెను చూపించింది. రేవంత్ ఎమోషనల్ అయ్యాడుగానీ, తేరుకుని మంచి పాట పాడాడు తన కూతురు కోసం, అలాగే తన భార్య కోసం. హౌస్ నుంచి ఇనాయా ఈ వారం ఎలిమినేట్ అయిపోయినట్లు తెలుస్తోంది.
676022 585262Cool text dude, maintain up the very good work, just shared this with the mates 931043
814280 253465Your weblog is showing a lot more interest and enthusiasm. Thank you so considerably. 518484
506229 791508An interesting discussion is worth comment. I believe which you require to write a lot more on this matter, it may possibly not be a taboo topic but normally individuals are not enough to speak on such topics. To the next. Cheers 475595
759411 79766Wow truly glad i came across your internet website, i??ll be confident to pay a visit to back now i??ve bookmarked it??. 312328
419112 217603Hey. Really good web site!! Man .. Outstanding .. Great .. Ill bookmark this internet site and take the feeds alsoI am pleased to locate so much useful details here within the post. Thanks for sharing 358172