నాగ శౌర్య హీరోగా నటించిన వరుస సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ మిగిల్చాయి. కాని ఈ సినిమా మాత్రం చాలా నమ్మకంను మోసుకు వచ్చింది. రీతూ వర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కు లేడీ డైరెక్టర్ లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహించారు. ఆమె ఈ సినిమాను ఎలా తీశారు.. కనీసం శౌర్యకు ఈ సినిమా అయినా సక్సెస్ ను అందించిందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
భూమి(రీతూ వర్మ) ఒక స్ట్రాంగ్ లేడీ. కాస్త పొగరుబోతు అమ్మాయి కూడా. తనకు తాను సొంతంగా ఒక స్టార్టప్ ను రన్ చేసుకుంటూ ఉంటుంది. మరో వైపు విదేశాల్లో ఆర్కిటెక్చర్ గా ఆకాష్(నాగశౌర్య) పని చేస్తూ ఉంటాడు. భూమి కి చెందిన భవన నిర్మాణ సంస్థతో కలిసి వర్క్ చేసేందుకు ఆకాశ్ ఇండియాకు వస్తాడు. అతడు భూమి తోనే ఎందుకు కలిసి వర్క్ చేయాలనుకున్నాడు..? వీరిద్దరి మద్య జరిగేదేంటీ అనేది ఈ సినిమా కథ.
నటీనటులుః
నాగ శౌర్య ఆకాష్ పాత్రకు జీవం పోషినట్లుగా అనిపించాడు. చాలా స్టైలిష్ గా మ్యాన్లీగా ఆకట్టుకున్నాడు. అతడి డ్రస్సింగ్ స్టైల్ మరియు ఇతర విషయాలతో అతడు పూర్తిగా ఆకట్టుకున్నాడు. సినిమాకు పూర్తి న్యాయం చేసే విధంగా నటించాడు. నటన పరంగా కూడా నాగ శౌర్య గతంతో పోల్చితే చాలా మెరుగు పడ్డట్లుగా అనిపించింది. రీతూ వర్మ మంచి నటనతో మెచ్చుకుంది. ఆమె లుక్ కూడా ఒక పొగరుబోతు అమ్మాయి మాదిరిగా బాగుంది. ఆమె చీర కట్టులో చాలా అందంగా హుందాగా కనిపించింది. భూమి పాత్రకు రీతూ వర్మ సూపర్ సెట్ అయ్యింది. హీరో హీరోయిన్ మద్య వచ్చే సన్నివేశాలు చాలా బాగున్నాయి. ఇద్దరు కూడా వాటికి జీవం పోసినట్లుగా నటించారు. ఇక కీలక పాత్రల్లో నటించిన వారు వారి పాత్రల పరిధిలో నటించి మెప్పించారు.
సాంకేతిక నిపుణులు:
సినిమాకు విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం అదనపు ఆకర్షణ ఇచ్చింది. పాటలు సినిమాకు మంచి అంశంగా నిలిచాయి అనడంలో సందేహం లేదు. కథ మరియు కథనం అనుసారంగా అతడి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. కొన్ని సన్నివేశాల్లో మనం ఉండి చూస్తున్నంత రియాల్టీ ఫీల్ కలిగింది. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా సింపుల్ గా క్యాచీగా అర్థం అయ్యే విధంగా ఉండటంతో పాటు కథానుసారంగా బాగున్నాయి. ఇక దర్శకురాలిగా ఈ సినిమా తో పరిచయం అయిన సౌజన్య మంచి కథను ఎంపిక చేసుకున్నారు. ఆమె ఈ కథపై చాలానే వర్కౌట్స్ చేసినట్లుగా అనిపిస్తుంది. మంచి భవిష్యత్తు ఉన్న దర్శకురాలు అనిపిస్తుంది. వరుడు కావలెను కథ మరియ స్క్రీన్ ప్లేను ఆమె బ్యాలన్స్ చేస్తూ ఆకట్టుకున్న విధానం చాలా బాగుంది.
ప్లస్ పాయింట్స్:
- హీరో హీరోయిన్ మద్య వచ్చే సన్నివేశాలు
- సంగీతం.
మైనస్ పాయింట్స్‌ః
- స్లో కథనం,
- కథలో స్ట్రాంగ్ పాయింట్స్ ఉండాల్సింది.
విశ్లేషణ:
వరుడు కావలెను ఒక ఎంటర్ టైనర్. హీరో హీరోయిన్ మరియు ఇతర నటీనటులు నటించిన తీరు మరియు వారి మద్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. మీరు టైమ్ పాస్ కోరుకుంటే ఖచ్చితంగా ఒక సారి చూసి ఎంటర్ టైన్ అవ్వడంతో పాటు మంచి టైమ్ పాస్ కూడా. భారీ అంచనాలు పెట్టుకుని వెళ్తే మాత్రం కాస్త నిరాశ తప్పదు.
రేటింగ్ః 2.75/5
It’s greatly feasible that you’re unable to give
in as much hours of research as you stated yourself to present
or even you have become nervous after having a very terrible game.