యువ హీరో నాగ శౌర్య యాక్షన్ హీరో ఇమేజ్ కోసం ప్రయత్నిస్తూ చేసిన అశ్వథ్థామ చిత్రం ఆశించిన స్థాయి విజయాన్ని కాకుండా నిరాశనే మిగిల్చిందని చెప్పాలి. దాంతో అటు లవ్ స్టోరీలకి ఓకే చెప్తూనే యాక్షన్ సినిమాలను కూడా చేస్తున్నాడు. సుబ్రమణ్యపురంను తెరకెక్కించిన సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నాగ శౌర్య తన 20వ సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఫుల్ గా మజిల్స్ పెంచి సిక్స్ ప్యాక్ బాడీతో విడుదలైన నాగ శౌర్య ఫస్ట్ లుక్ అందరినీ మెప్పించింది.
ఇందులో నాగ శౌర్య ఒక విల్లుకాడి పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ చిత్ర టైటిల్ ని ఇవాళ సాయంత్రం అధికారికంగా ప్రకటించనున్నారు. కానీ మేము తెలుసుకున్న ఎక్స్ క్లూజివ్ సమాచారం ప్రకారం ‘లక్ష’ అనే టైటిల్ ని ఖరారు చేశారట. గతంలో పలు టైటిల్స్ ని పరిశీలించిన ఈ చిత్ర టీం ఒక టైంలో ‘పార్ధు’ అనే టైటిల్ ను దాదాపుగా ఖరారు చేశారు. కానీ ఫైనల్ గా లక్ష అనే టైటిల్ కి ఫిక్స్ అయినట్లు సమాచారం.
ఈ చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు తెలిసిందే. రామ్ మోహన్, సునీల్ నారంగ్, శరత్ మరార్ నిర్మాతలుగా ఉన్నారు. కాల భైరవ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు.
It's time to aim at the title of #NS20. Tomorrow @5:04pm See you then:) #RamMohan @sharrath_marar @SVCLLP @nseplofficial @Santhosshjagar1 @RaamDop @EditorJunaid #KetikaSharma @kaalabhairava7 #NS20TitleReveal#IndiasFirstFilmonArchery#Archery pic.twitter.com/ahdUakv8zs
— Naga Shaurya (@IamNagashaurya) November 29, 2020