Switch to English

నభా నటేష్‌ని బలి చేసిన పూరీ జగన్నాధ్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

పూరీ జగన్నాధ్‌ దెబ్బకి హీరోయిన్‌ నభా నటేష్‌ కెరీర్‌ అటకెక్కిపోయేలా ఉంది. ‘ఛీ ఇంత ఛండాలమైన డైలాగ్‌ ఎలా చెప్పావ్‌.?’ అంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్లు నభా నటేష్‌ని ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ‘డాష్‌’ పోయించడం గురించి పూరీ జగన్నాధ్‌ గతంలోనూ వివాదాలు ఎదుర్కొన్నాడు. మహేష్‌బాబు హీరోగా రూపొందిన ‘బిజినెస్‌మేన్‌’ సినిమాలో ‘ముంబయ్‌ని డాష్‌ పోయించడానికి వచ్చాను..’ అని మహేష్‌బాబు చెప్పిన డైలాగ్‌ అప్పట్లో పాపులర్‌ అయ్యింది. అదే సమయంలో వివాదాస్పదమైంది. నానా రచ్చ జరిగినాక ఆ డైలాగ్‌ని సినిమాలో మ్యూట్‌ చేయాల్సి వచ్చింది. ఇప్పుడూ అదే జరుగుతుందా.?

మరీ దారుణంగా ఈ సారి హీరోయిన్‌తో ఆ జుగుప్సాకరమైన డైలాగ్‌ చెప్పించిన పూరీ సభ్య సమాజానికి ఏం సంకేతాలు పంపుతున్నట్లు.? మాస్‌ అంటే, బూతులేనని పూరీ జగన్నాధ్‌ భావిస్తుండడం దురదృష్టకరం అని పూరీ అభిమానులే సోషల్‌ మీడియాలో మండి పడుతున్నారు. అయితే, వివాదాలు తెచ్చే పబ్లిసిటీ తాలూకు టేస్ట్‌ పూరీ జగన్నాధ్‌కి బాగా తెలుసు. అందుకేనేమో, ఏరి కోరి ఇలాంటి డైలాగులు పెడుతుంటాడు. సినిమాలో హీరోయిన్ల గ్లామర్‌ ఒకెత్తు. నభా నటేష్‌ చెప్పే డైలాగులు ఇంకో ఎత్తు.. అన్నట్లు తయారైంది పరిస్థితి.

ఇదిలా ఉంటే, సినిమాలో ఆ సీన్‌ ఏంటో, అది తెచ్చే ఇంపాక్ట్‌ ఏంటో సినిమా విడుదలయ్యాక తెలుస్తుందనీ, ఈ రోజుల్లో ఆ డైలాగ్‌ చాలా కామన్‌ అనీ, దానిపై రాద్ధాంతం చేయడం అనవసరం అనీ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ టీమ్‌ మెంబర్స్‌ చెబుతున్నారు. ఈ నెల 18న ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. సినిమా సక్సెస్‌ అవుతుందా.? లేదా.? అన్న విషయం పక్కన పెడితే, నభా నటేష్‌ ఇమేజ్‌ మాత్రం బాగా డ్యామేజ్‌ అయిపోయిందంటున్నారు. తెలుగులో ఇప్పటిదాకా ఆమె చేసిన రెండు సినిమాల్లోనూ చాలా క్యూట్‌గా కనిపించింది. ఇందులో చాలా హాట్‌గా కనిపిస్తోంది. ఆమెకున్న క్యూట్‌ అప్పీల్‌ ఆమె ప్రదర్శించిన హాట్‌ అప్పీల్‌ అదిరిపోయాయ్‌ కానీ, ఒక్క డైలాగ్‌తో ఆమె తన స్థాయిని దిగజార్చేసుకుందని నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమెని విమర్శిస్తూ రకరకాల మీమ్స్‌ తయారు చేసి వదులుతున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...