Switch to English

ఏపీలో ఇక మనీ మనీ.. మోర్ మనీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

ఏపీలో పోలింగ్ కు సమయం సమీపిస్తోంది. ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి.

అధికార తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో పక్కాగా ప్లాన్ చేసుకుని సన్నద్ధంగా ఉంది. ఇప్పటివరకు వచ్చిన సర్వేల్లో ఏ ఒక్కదాంట్లోనూ అనుకూల ఫలితం రాకపోవడంతో ముందుగానే అప్రమత్తమైంది. ఓటర్లను ఎలా ప్రసన్నం చేసుకుంటే ఓట్లు పడతాయనే అంశంపై బాగానే కసరత్తు చేసింది. అందుకు అనుగుణంగా ప్రణాళికలు ముందుగానే రచించుకుంది.

ఏప్రిల్ 11న ఏపీలో పోలింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి వివిధ పథకాల కింద ప్రజలకు డబ్బు చెల్లించే ఏర్పాట్లు చేసుకుంది. ఏప్రిల్ 1న యథావిధిగా పించన్లు పంపిణీ చేస్తుంది. 4న పసుపు-కుంకుమ పథకం కింద డ్వాక్రా మహిళలకు చెక్కులు అందించనుంది.

ఇక 5న రుణమాఫీ నాలుగు, ఐదో విడతల మొత్తం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. 8న అన్నదాతా సుఖీభవ పథకం కింద రైతులకు పెట్టుబడి మొత్తాన్ని ఖాతాల్లో వేస్తుంది. అధికారికంగా ఇచ్చే ఈ డబ్బులతోపాటు పోలింగ్ కు ముందు రోజు ఓటర్లకు ఇచ్చే తాయిలాలూ ఎలాగూ ఉంటాయి. అంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పోలింగ్ కు ముందు వరకు ఏదో ఒక రూపంలో జనానికి డబ్బు అందుతుందన్న మాట.

వాస్తవానికి రుణమాఫీకి సంబంధించి నాలుగు, ఐదు విడతల మొత్తం ఫిబ్రవరిలో వేస్తామని టీడీపీ సర్కారు గతంలో ప్రకటించింది. అయితే, అప్పుడే వేస్తే పోలింగ్ సమయానికి మరచిపోయే అవకాశం ఉందని భావించి, ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. ఎట్టిపరిస్థితుల్లోనూ అనుకున్న ప్రకారం ఈ కార్యక్రమాలన్నీ కచ్చితంగా జరపాలని టీడీపీ అధినాయకత్వం నిర్ణయించింది.

పించన్ల పంపిణీకి సంబంధించి ఎలాంటి సమస్యా లేదు. అలాగే పసుపు-కుంకుమ పథకం కింద చెక్కులు ఇస్తారు కాబట్టి దానికీ నిధుల సమస్య ఉండదు. ఇక అన్నదాతా సుఖీభవ కింద ఈ విడతలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మొత్తం రూ.1000 మాత్రమే. ప్రధానమంత్రి కిసాన్ వికాస్ యోజన పథకం ద్వారా ఇచ్చే సొమ్ముకు ఈ వెయ్యిని రాష్ట్ర ప్రభుత్వం జోడించి ఆయా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది.

రాష్ట్రంలో దాదాపు 50 లక్షల మంది అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం రూ.500 కోట్లు మాత్రమే కావడంతో దీనికీ నిధుల సమస్య లేదు. ఇక రుణమాఫీ నాలుగు, ఐదు విడతల మొత్తం కూడా ఇప్పుడే చెల్లించాలని ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇది కొంచెం పెద్ద మొత్తం కావడంతో నిధుల సమస్య తలెత్తే అవకాశం ఉంది.

రైతులకు ఒక్కో విడతకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు చెల్లించాల్సి ఉందని అంచనా. అంటే రెండు విడతలకు కలిపి దాదాపు రూ.70 వేలకు పైగా జమ చేయాల్సి ఉంటుంది. ఇందుకు చాలా పెద్ద మొత్తమే కావాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భారీ మొత్తం ఎలా సర్దుబాటు అవుతుందనే అంశంపై ప్రభుత్వ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం.

అయితే, రుణమాఫీ అనేది గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీ కాబట్టి, ఈ ఎన్నికల ముందైనా దానిని నెరవేర్చకుంటే ఓటింగ్ పై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఏదో ఒక విధంగా ఆ మొత్తం సర్దుబాటు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే, మాఫీ మొత్తం పూర్తిగా వేస్తారా? లేక నిధుల లభ్యతకు అనుగుణంగా తగ్గించి వేస్తారా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. పోలింగ్ కు ముందు వేసే డబ్బులు కాబట్టి, కచ్చితంగా ఓట్లు తమకు అనుకూలంగా పడతాయని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి, వారి అంచనా నిజమవుతుందో లేదో తెలియాలంటే మే 23 వరకు ఆగకు తప్పదు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Devara: ‘బడా నిర్మాత బడాయి కబుర్లు..’ దేవర పాటకు నెటిజన్స్ ట్రోలింగ్

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా దేవర (Devara). ఇటివలే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినిమాలో ఫియర్...

Taapsee: డెలివరీ బాయ్ నిబద్ధత.. స్టార్ హీరోయిన్ ఎదురైనా పనిలోనే.. వీడియో...

Taapsee: సినిమా తారలంటే ఎప్పుడూ క్రేజే. తెరపై అలరించేవారు బయట ఎదురైతే ఉబ్బితబ్బిబ్బవుతాం. వెంటనే మొబైల్ తీసి సెల్పీల కోసం ప్రయత్నిస్తాం. స్టార్ హీరో, హీరోయిన్లైతే...

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

రాజకీయం

ఈవీఎంని పగలగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు ఓ వైసిపి ఎమ్మెల్యే ఈవీఎం ని ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 13 న పొలింగ్ జరుగుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి...

రేవ్ పార్టీ.! ఎంట్రీ ఫీజు అన్ని లక్షలా.? ఏముంటుందక్కడ.?

రేవ్ పార్టీ.. ఈ మాట చాలాకాలంగా మనం వింటున్నదే.! పోలీసులు ఫలానా చోట రేవ్ పార్టీ జరుగుతోంటే, దాన్ని భగ్నం చేశారన్న వార్తల్ని ఎప్పటికప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే వింటున్నాం. కానీ, అసలు...

ఏపీ ఎన్నికల సిత్రమ్: తన మీద తానే బెట్టింగ్ వేసుకున్నాడట.!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బెట్టింగ్ అనేది ట్రెండ్ సెట్టింగ్ వ్యవహారంలా మారిపోతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి బెట్టింగ్ జరగడమనేది సర్వసాధారణమే అయిపోయిందిప్పుడు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగ్...

వైసీపీ ఆ 95 చోట్ల ఓడిపోనుందట.! ఈ లెక్క పక్కా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులపైనే వుంది. అసెంబ్లీతోపాటు లోక్ సభ నియోజకవర్గాలకూ పోలింగ్ పూర్తయ్యింది. ఎవరు గెలుస్తారన్నది జూన్ 4న తేలుతుంది. అయితే, ఎన్నికల ఫలితాల వెల్లడికి...

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

ఎక్కువ చదివినవి

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్ లో ఫ్యాన్స్

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి చేసిన ఇన్ స్టా రీల్స్, పోస్టులు,...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...