Switch to English

చంద్రబాబువి తప్పటడుగులేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

రాజకీయాల్లో ఎంతో అనుభవం సంపాదించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇప్పుడు అనవసర తప్పిదాలు చేస్తున్నారా? చిన్న విషయాల్లో కూడా సరైన నిర్ణయం తీసుకోలేక తప్పటడుగులు వేస్తున్నారా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది.

రాష్ట్రంలోకి సీబీఐ ప్రవేశాన్ని నిషేధించడం దగ్గర నుంచి కేంద్ర ఎన్నికల సంఘంతో ప్రస్తుతం అవలంభిస్తున్న వైఖరి వరకూ అన్నీంటా అనవసర తప్పిదాలు చేశారని అంటున్నారు. ఆయా అంశాల్లో తప్పులు లేకుంటే ఇంత హంగామా చేయాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు.

ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే కేంద్ర ఎన్నికల సంఘమే సుప్రీం. ఎన్నికల సంఘం తీసుకునే ప్రతి నిర్ణయం రాజ్యాంగం చెల్లుబాటయ్యేదే. కోడ్ అమల్లో ఉండగా.. ప్రధాని సహా అందరి అధికారాలకూ కోత తప్పదు. అలాగే ఎన్నికల ముందు అధికారుల బదిలీలు జరగడం కూడా చాలా సర్వసాధారణమైన విషయం. ఆరోపణలున్న అధికారులను బదిలీ చేయడం ఈసీ విధి.

ఇదే తరహాలో ఏపీలో కూడా ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆ అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడంతోనే ఈసీ వారిపై చర్యలు తీసుకుంది. ఈసీ నిర్ణయానికి అనుగుణంగా టీడీపీ వ్యవహరిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు.

పైగా హూందాగా వ్యవహరించిందనే పేరు కూడా వచ్చేది. తొలుత, ఈసీ ఆదేశాలను పాటించిన ఏపీ సర్కారు.. అంతలోనే మనసు మార్చుకుంది. ఇద్దరు ఎస్పీలను బదిలీ చేసి, ఇంటెలిజెన్స్ డీజీ బదిలీని మాత్రం నిలిపివేసింది. అనంతరం నేరుగా ఈసీపై పోరుకు దిగింది. ఈ వ్యవహారంపై నేరుగా ఈసీకి తన అసంతృప్తి వ్యక్తంచేస్తూ లేఖ రాయడమే కాకుండా కోర్టులో వ్యాజ్యం కూడా దాఖలు చేసింది.

మరోవైపు తెలుగుదేశం నేతలు ఈసీపై తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. ఎన్నికల సంఘానికి ఇంగితం లేదని, పరిధి దాటి ప్రవర్తిస్తోందని అనుచిత వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఇది టీడీపీకే ప్రతికూలంగా మారింది. తమకు అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారి బదిలీ అయితే, ఎన్నికల్లో ఇబ్బంది కలుగుతుందని భావించడం వల్లే ఏపీ సర్కారు ఇలా ప్రవర్తిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఒకవేళ ప్రతిపక్ష నేతల ఆరోపణల్లో నిజం లేకుంటే టీడీపీ ఇంతగా స్పందించాల్సిన అవసరం ఉండేది కాదు. అలాకాకుండా ఏకంగా ఈసీతోనే పోరుకు దిగడంతో అంతర్గతంగా ఏదో జరుగుతుందనే భావన జనాల్లో కలుగుతోంది. మరోవైపు ఈ అంశంలో చంద్రబాబు వైఖరిని ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నేతలు దనుమాడుతున్నారు.

పదేళ్ల క్రితం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేశారో మరచిపోయారా అంటూ ప్రశ్నిస్తున్నారు. 2009 ఎన్నికల సమయంలో డీజీపీగా ఉన్న ఎస్ఎస్పీ యాదవ్ పై చంద్రబాబు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆయన అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేశారు. యాదవ్ ని బదిలీ చేసేంత వరకు వదిలిపెట్టకుండా పోరాటం సాగించారు.

దీంతో కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీ యాదవ్ ను తప్పించి, ఆయన స్థానంలో మహంతిని నియమించింది. దీనిపై అప్పటి వైఎస్ ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ఈసీ ఆదేశాల మేరకే నడుచుకుంది. ఆ ఎన్నికల్లో వైఎస్ తిరిగి అధికారం చేపట్టారు. అయితే, చంద్రబాబు ఆ సంగతి మరచిపోయి ఇప్పుడు ఏకంగా ఈసీపైనే పోరుకు దిగడం, ఆయన ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని వైఎస్సార్ సీపీ నేతలు విమర్శిస్తున్నారు.

కేవలం ముగ్గురు ఐపీఎస్ అధికారుల బదిలీలకే చంద్రబాబు ఇంత హంగామా చేయడం చూస్తుంటే, ఇక డీజీపీని బదిలీ చేస్తే ఏ విధంగా స్పందిస్తారో అర్థంకావడంలేదని అంటున్నారు. ప్రస్తుత డీజీపీ ఠాకూర్ పై కూడా వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఆయన టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, ఎన్నికలు సజావుగా జరగాలంటే ఆయన్ను తప్పించాల్సిందేనని ఈసీకి ఇప్పటికే విన్నవించారు. అయితే, ఈసీ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ డీజీపీని బదిలీ చేస్తే బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సిందే.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Devara: ‘బడా నిర్మాత బడాయి కబుర్లు..’ దేవర పాటకు నెటిజన్స్ ట్రోలింగ్

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా దేవర (Devara). ఇటివలే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినిమాలో ఫియర్...

Taapsee: డెలివరీ బాయ్ నిబద్ధత.. స్టార్ హీరోయిన్ ఎదురైనా పనిలోనే.. వీడియో...

Taapsee: సినిమా తారలంటే ఎప్పుడూ క్రేజే. తెరపై అలరించేవారు బయట ఎదురైతే ఉబ్బితబ్బిబ్బవుతాం. వెంటనే మొబైల్ తీసి సెల్పీల కోసం ప్రయత్నిస్తాం. స్టార్ హీరో, హీరోయిన్లైతే...

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

రాజకీయం

ఈవీఎంని పగలగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు ఓ వైసిపి ఎమ్మెల్యే ఈవీఎం ని ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 13 న పొలింగ్ జరుగుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి...

రేవ్ పార్టీ.! ఎంట్రీ ఫీజు అన్ని లక్షలా.? ఏముంటుందక్కడ.?

రేవ్ పార్టీ.. ఈ మాట చాలాకాలంగా మనం వింటున్నదే.! పోలీసులు ఫలానా చోట రేవ్ పార్టీ జరుగుతోంటే, దాన్ని భగ్నం చేశారన్న వార్తల్ని ఎప్పటికప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే వింటున్నాం. కానీ, అసలు...

ఏపీ ఎన్నికల సిత్రమ్: తన మీద తానే బెట్టింగ్ వేసుకున్నాడట.!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బెట్టింగ్ అనేది ట్రెండ్ సెట్టింగ్ వ్యవహారంలా మారిపోతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి బెట్టింగ్ జరగడమనేది సర్వసాధారణమే అయిపోయిందిప్పుడు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగ్...

వైసీపీ ఆ 95 చోట్ల ఓడిపోనుందట.! ఈ లెక్క పక్కా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులపైనే వుంది. అసెంబ్లీతోపాటు లోక్ సభ నియోజకవర్గాలకూ పోలింగ్ పూర్తయ్యింది. ఎవరు గెలుస్తారన్నది జూన్ 4న తేలుతుంది. అయితే, ఎన్నికల ఫలితాల వెల్లడికి...

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

ఎక్కువ చదివినవి

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

ఏపీ ఎన్నికల సిత్రమ్: తన మీద తానే బెట్టింగ్ వేసుకున్నాడట.!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బెట్టింగ్ అనేది ట్రెండ్ సెట్టింగ్ వ్యవహారంలా మారిపోతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి బెట్టింగ్ జరగడమనేది సర్వసాధారణమే అయిపోయిందిప్పుడు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగ్...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.. మాస్ లో క్రేజ్.. వీటన్నింటి గురించి...