Switch to English

ప్రధాని మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ.! వాళ్ళకెందుకు వణుకు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో విశాఖపట్నంలో భేటీ కానున్నారు. ఈ వార్త బయటకు రాగానే, ‘అంతా ఫేక్..’ అనేసింది వైసీపీ అను‘కుల’ మీడియా.! ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన కోసం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు ఓ వైపు, వైసీపీ పార్టీ చేసుకుంటున్న ఏర్పాట్లు ఇంకో వైపు.. వెరసి అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి.

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించడంలేదంటూ, ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనని సైతం లైట్ తీసుకుంటోంది తెలంగాణ సర్కార్. మరి, ప్రత్యేక హోదా సహా విభజన హామీలేవీ నెరవేర్చని కేంద్రం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంకెలాంటి వైఖరి ప్రదర్శించాలి.. అక్కడి అధికార పార్టీ ఇంకెంతలా రాజకీయ విమర్శలు చేయాలి.?

సరే, రాజకీయం వేరు.. ప్రోటోకాల్స్ వేరనుకోండి.. అది వేరే సంగతి. ప్రధాని మోడీ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయాల్సిందే.. అది తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా.. ప్రోటోకాల్ పాటించి తీరాలి. ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వాన్ని తప్పు పట్టలేం.

కానీ, మూడు లక్షల మందిని ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించబోయే బహిరంగ సభకు రప్పించేందుకు వైసీపీ ప్రయత్నించడమేంటి.? ఇందుకోసం పార్టీ శ్రేణులకు ప్రత్యేకంగా పిలుపునివ్వడమేంటి.? ఇదంతా నాణానికి ఓ వైపు మాత్రమే. ఇంకో వైపు, పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అవకుండా వుండేందుకోసం.. వైసీపీ అధినాయకత్వం ఢిల్లీ స్థాయిలో మేగ్జిమమ్ లాబీయింగ్ చేసిందన్న ప్రచారం సహజంగానే అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.

తెలంగాణలో అయితే పవన్ కళ్యాణ్‌ని అస్సలు బీజేపీ పట్టించుకోదట.. ప్రధాని మోడీ పర్యటనలో పవన్ కళ్యాణ్‌కి ఛాన్స్ వుండదట. అందుకే, విశాఖను పవన్ కళ్యాణ్ ఎంచుకున్నారనీ, ఈ క్రమంలో పవన్ చాలా దిగజారిపోయారనీ.. వైసీపీ అను‘కుల’ మీడియా సహజంగానే రోత రాతల్ని తెరపైకి తెచ్చింది.

మోడీని పవన్ కళ్యాణ్ కలవడం, కలవకపోవడం అన్నది రెండు పార్టీలకు సంబంధించిన వ్యవహారం. ఆ రెండు పార్టీలూ మిత్రపక్షాలు. మోడీ అపాయింట్మెంట్ ఖరారయ్యింది గనుకనే, విశాఖ పర్యటన పెట్టుకున్నారు జనసేనాని. గతంలో భీమవరం వెళ్ళి ప్రధానిని కలిసే అవకాశం పవన్ కళ్యాణ్‌కి లభించినా కొన్ని ప్రత్యేక కారణాల వల్ల వెళ్ళలేకపోయారు.

అప్పుడు వెళ్ళలేకపోయారు.. ఇప్పుడు వెళుతున్నారు.. ఇది పూర్తిగా పవన్ ఛాయిస్.! ప్రధాని మోడీ నుంచి జనసేనాని ఆశిస్తున్న రోడ్ మ్యాప్ విశాఖలో లభిస్తే.. ఆ తర్వాత వ్యవహారం వేరే లెవల్‌లో వుంటుంది. అయినా, మోడీతో పవన్ భేటీ అయితే వైసీపీ ఎందుకు వణుకుతోంది.? వైసీపీ అను‘కుల’ మీడియా ఎందుకు భయపడుతోంది.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...