Switch to English

ఈ మహేష్‌ మామూలోడు కాదండోయ్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

మహేష్‌ విట్టా.. బిగ్‌బాస్‌ 3 తెలుగు రియాల్టీ షోలో అండర్‌ రేటెడ్‌ కంటెస్టెంట్‌. అయినాగానీ, ఇప్పటిదాకా హౌస్‌లో కొనసాగుతున్నాడంటే అది నిజంగానే విచిత్రం. ‘నాకేంటి.? నేనెప్పుడు ఎలిమినేట్‌ అయిపోయినా నష్టం లేదు..’ అని పదే పదే చెబుతుండేవాడు. ‘ఇన్విటేషన్‌తో వచ్చా.. అప్లికేషన్‌ పెట్టుకుని రాలేదు..’ అంటూ బిగ్‌బాస్‌ని ధిక్కరించాడు మహేష్‌ ఓ సందర్భంలో. అతని వ్యవహారశైలి కొన్ని సందర్భాల్లో వివాదాస్పదమయ్యింది.. కొన్ని సందర్భాల్లో మహేష్‌ పెర్‌ఫెక్ట్‌ లాజిక్‌తో మాట్లాడాడని కంటెస్టెంట్స్‌తోపాటు, బిగ్‌ హోస్ట్‌ నాగార్జున కూడా మెచ్చుకున్నాడు.

ఈ రోజు సాయంత్రం జరిగే ఎపిసోడ్‌లో మహేష్‌ ఎలిమినేట్‌ అయిపోతున్నాడనే ప్రచారం జరుగుతున్న వేళ, నిన్నటి ఎపిసోడ్‌లో మహేష్‌ వ్యవహరించిన తీరు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. టైటిల్‌ విన్నర్‌.. అంటూ సీజన్‌ స్టార్టింగ్‌ నుంచీ శ్రీముఖి పేరు విన్పిస్తోన్న విషయం విదితమే. ఆమెకు హోస్ట్‌ నాగార్జున నుంచి ఫుల్‌ సపోర్ట్‌ వుంది. బిగ్‌బాస్‌ కూడా శ్రీముఖిని ప్రత్యేకంగా చూస్తున్నాడు. అలాంటి శ్రీముఖిని మహేష్‌ విట్టా కడిగి పారేశాడు. బిగ్‌హౌస్‌లో శ్రీముఖి ఆడుతున్న గేమ్‌ అస్సలేమాత్రం సబబు కాదని తేల్చేశాడు.

తన గేమ్‌ కోసం, పక్కోడి సెంటిమెంట్స్‌తోనూ శ్రీముఖి ఆటలాడుకుంటుందనీ.. ఎవరికయినా దెబ్బ తగిలితే.. వారిని తాము ఓదార్చుతున్నప్పుడు, తమను పక్కకు నెట్టేసి మరీ శ్రీముఖి యాక్టింగ్‌ చేసేస్తుందని మహేష్‌ చెప్పాడు. ఇతరుల్ని ఇన్‌ఫ్లూయెన్స్‌ చేసి, గేమ్‌ నుంచి బయటకు పంపెయ్యడం శ్రీముఖికి బాగా తెలుసనీ మహేష్‌ అన్నాడు. మహేష్‌ వాదనతో శ్రీముఖి ఏకీభవించదనుకోండి.. అది వేరే సంగతి. ఏదిఏమైనా, శ్రీముఖిని ఈ సీజన్‌ మొత్తం చూస్తున్నవారంతా మహేష్‌ వాదనతో ఏకీభవిస్తున్నారు.

మరోపక్క శ్రీముఖి ఫాలోవర్స్‌, మహేష్‌ని విపరీతంగా ట్రోల్‌ చేసేస్తున్నారు. అయితే, బిగ్‌బాస్‌ టైటిల్‌ విన్నర్‌గా తాను అనర్హుడిననీ.. ఎందుకంటే, తాను అందర్నీ మెప్పించడానికి తనను తాను మార్చుకోలేననీ.. అదే సమయంలో తనకూ కొన్ని లోపాలు వున్నాయనీ.. మహేష్‌ తన గురించి కూడా క్లారిటీ ఇచ్చేసుకున్నాడు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు కూడా వుంటారు. అందుకే, యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో...