Switch to English

వంశీ పైడిపల్లితో మహేష్‌ ఇంకోస్సారి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా రూపొందిన ‘మహర్షి’ ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెల్సిందే. ఈ సినిమాకి సంబంధించి విడుదలకు ముందు చాలా ‘నెగెటివ్‌ ప్రచారం’ జరిగింది. అయితే, దాన్ని చిత్ర యూనిట్‌ సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నించింది. సాధారణంగా మహేష్‌ సినిమాలకి ఈ స్థాయి నెగెటివిటీ రావడం ఆశ్చర్యకరమే. ఎందుకంటే మహేష్‌, ఇండస్ట్రీలో పెద్దగా వివాదాల్లేని వ్యక్తి. వంశీ పైడిపల్లి కూడా అంతే. నిర్మాతలు దిల్‌ రాజు, అశ్వనీదత్‌, పివీపీ.. ఇలా ఎవరి విషయంలోనూ ‘వ్యతిరేకత’ పెద్దగా కన్పించదు. కారణాలేవైతేనేం, నెగెటివిటీని తట్టుకుని ‘మహర్షి’ అద్భుత విజయాన్ని అందుకుంది.

సినిమా విజయానికి ఉప్పొంగిపోతూ, మహేష్‌ కాలర్‌ ఎగరేయడమంటే చిన్న విషయం కాదు. అలా మహేష్‌ వ్యవహరించాడంటే, సినిమాకి అంతకు ముందు వచ్చిన వ్యతిరేకత, అందులోంచి దక్కిన విజయం తాలూకు ‘గర్వం’ అది. దాన్ని గర్వం అనడం కన్నా, ‘టెన్షన్‌ నుంచి రిలీఫ్‌’ అవడం అనడం కరెక్టేమో. ఇప్పుడిదంతా ఎందుకంటే, ఇంకోసారి మహేష్‌ – వంశీ పైడిపల్లి కాంబినేషన్‌ రిపీట్‌ అవబోతోందట.

‘మహర్షి’ సినిమాని వంశీ చెక్కీ చెక్కీ చెడగొట్టాడని ప్రీ రిలీజ్‌ విన్పించిన వదంతుల సంగతెలా వున్నా, వంశీని మహేష్‌ పూర్తిగా నమ్మాడు. ఆ నమ్మకం ఏ స్థాయిలో వుందంటే, ‘ఇంకో సినిమా మనం చేస్తున్నాం’ అని అప్పుడే వంశీకి మహేష్‌ హామీ ఇచ్చేంతలా. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వంశీ, మహేష్‌తో చేయబోయే సినిమాకి నిర్మాత ఇంకెవరో కాదు, మహేష్‌బాబేనట. అతి త్వరలోనే మహేష్‌, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయబోయే కొత్త సినిమా గురించి అనౌన్స్‌మెంట్‌ ఇవ్వవచ్చునని తెలుస్తోంది.

ప్రస్తుతం మహేష్‌బాబు, అనిల్‌ రావిపూడితో ఓ సినిమాకి కమిట్‌ అయ్యాడు. ఆ సినిమా స్క్రిప్ట్‌ దశలో వుంది. ఆ తర్వాత మహేష్‌, త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేస్తాడనే ప్రచారం జరుగుతోంది. సుకుమార్‌తోనూ మహేష్‌ ఓ సినిమా చేసే అవకాశాలున్నాయి. మరి, మహేష్‌ – వంశీ పైడిపల్లికి ఎప్పుడు టైమ్‌ కేటాయించగలడు? అంటే, మహేష్‌ కోసం వంశీ పైడిపల్లి ఎంత కాలమైనా ఎదురుచూస్తాడని ‘మహర్షి’తోనే ప్రూవ్‌ అయ్యింది కదా!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...