మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఇటీవలే విడుదలైన మహర్షి మంచి విజయం దిశగా దూసుకుపోతుంది. మొదటి వీకెండ్ లోనే ఏకంగా 100 కోట్ల వసూళ్లు అందుకున్న ఈ సినిమా విడుదలైన అన్ని ఏరియాలు హౌస్ ఫుల్ కలక్షన్స్ తో నడుస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలో మరికొన్ని కొత్త సన్నివేశాలను యాడ్ చేస్తారట. ఇప్పటికే మూడు గంటలపాటు ఉన్న ఈ సినిమా నిడివి ఎక్కువైందనే కారణంతో కొన్ని సన్నివేశాలు కట్ చేశారట. అయితే సినిమాకు మంచి టాక్ రావడంతో పాటు ఆ సన్నివేశాలు మహేష్ కి బాగా నచ్చాయట .. దాంతో వాటిని మళ్ళీ యాడ్ చేస్తున్నట్టు యూనిట్ తెలిపింది.
కొత్త సన్నివేశాల కారణంగా సినిమా మరో పది నిముషాలు పెరిగే అవకాశం ఉంది. కట్ చేసిన సన్నివేశాల్లో రెండు కామెడీ సీన్స్ కూడా ఉన్నాయట. రేపటినుండి ఆ సన్నివేశాలను యాడ్ చేస్తారట. మహేష్ బాబు కెరీర్ లో ల్యాండ్ మార్క్ సినిమాగా వచ్చిన మహర్షి పై విడుదలకు ముందు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే వాటిని అందుకునేలా ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2000 స్క్రీన్స్ లో విడుదలచేసారు . నాన్ బాహుబలి కేటగిరి లో ఇదే హయ్యెస్ట్ థియేటర్స్ లో విడుదలైన సినిమాగా నిలిచింది.
ఇక సినిమా నిడివి విషయంలో ఇప్పటికే మూడు గంటలా అని షాకవుతున్న ప్రేక్షకులు .. ఈ కొత్త సీన్స్ యాడ్స్ చేస్తే ఏమంటారో చూడాలి. ఎందుకంటే ఇప్పటికే కాస్త బోర్ గా కథ సాగుతుందని విమర్శలు వస్తున్నాయి. దాన్ని ట్రిమ్ చేయకపోగా .. మరికొన్ని సీన్స్ అంటే ఆలోచించాల్సిందే.