టాలీవుడ్ లో ఆ దర్శకుడంటే ఓ రేంజ్ క్రేజ్ ఉంది. మాస్ చిత్రాల దర్శకుడిగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న అయన అటు స్టార్ హీరోలతోనూ ఇటు కుర్ర హీరోలతోనూ పలు హిట్ చిత్రాలను తెరకెక్కిచాడు. మాస్ అంశాలు .. గాల్లో సుమోలు లేవడం లాంటి యాక్షన్ అంశాలు అంటే ఈ డైరెక్టర్ కె చెల్లింది? ఇప్పుడు ఆ దర్శకుడు హీరోగా మారుతున్నాడు ? మీకీపాటికే ఆ దర్శకుడు ఎవరో అర్థం అయింది కదా ! ఎస్ .. ఆయనే మాస్ దర్శకుడు వివి వినాయక్.
తాజాగా వినాయక్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఆయన హీరోగా తెరకెక్కే సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడట. శరభ ఫేమ్ ఎన్ నరసింహ రావు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుందట. దర్శకుడు వినాయక్ కు కూడా సినిమాలో చిన్న రోల్ లో కనిపించడం ఇష్టం. మెగాస్టార్ చిరంజీవి ఠాగూర్ సినిమాలో ఓ చిన్న పాత్ర వేశారు. తాజాగా మెగాస్టార్ ఖైదీ నంబర్ 150 లో కూడా ఓ సన్నివేశంలో కనిపించాడు.
వినాయక్ హీరోగా మారడానికి కారణం ఏమిటన్నది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. వినాయక్ దర్శకుడిగా ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాతో దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ సినిమా సూపర్ హిట్టవ్వడంతో వెంటనే బాలకృష్ణ తో సినిమా అవకాశం వచ్చింది. బాలయ్యతో చేసిన చెన్నకేశవరెడ్డి ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆ వెంటనే దిల్ రాజు నిర్మాతగా పరిచయం అవుతూ నితిన్ తో తీసిన దిల్ సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు వినాయక్. మొత్తానికి నిర్మాతగా దిల్ రాజుని నిలబెట్టిన దిల్ సినిమా దిల్ రాజు ఇంటి పేరుగా మారింది. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అధికారిక వివరాలు వెల్లడి కానున్నాయి.