వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న మహర్షి చిత్రం పైనే ప్రస్తుతం టాలీవుడ్ ఫోకస్ అంతా ఉంది. ఈ నెల 25న విడుదల అవుతున్న ఈ సినిమా తప్ప ఈ లోపు పెద్ద హీరోల సినిమాలేవీ లేకపోవడంతో అందరి దృష్టి మహర్షి పైనే పడింది.
ఇక మెగాస్టార్ సైరా, ప్రభాస్ సాహో సినిమాలు ఆగస్టులో రానున్నాయి కాబట్టి ఈ సమ్మర్ లో వచ్చే ఏకైక పెద్ద సినిమా ఇదే. ఇప్పటికే విడుదలైన సాంగ్, ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యం గా ఇటీవలే విడుదలైన మొదటి సాంగ్ అప్పుడే లక్షల్లో వ్యూస్ రాబడుతూ దూసుకుపోతుంది. ఇక దర్శక నిర్మాతలు కూడా ప్రమోషన్ మొదలు పెట్టేసారు.
దాంతో పాటు బిజినెస్ కూడా భారీగానే జరుగుతుంది. మహర్షి సినిమాకు వస్తున్న బిజినెస్ డీల్స్ చూస్తుంటే మహేష్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బిజినెస్ జరిగేలా ఉందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని అమెజాన్ సంస్థ ఏకంగా 11 కోట్లకు సొంతం చేసుకోవడం విశేషం .
ఇక థియేట్రికల్ రైట్స్ .. సాటిలైట్ హక్కులు కలిపి ఈజీగా డెబ్భై కోట్లు చేస్తుందని అంటున్నారు .. ఈ లెక్కన మహేష్ సినిమా వందకోట్ల సినిమాగా నిలబడడం ఖాయమని ట్రెడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి మహర్షి మాములోడుకాదు అంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా .. అల్లరి నరేష్ మరో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.
9882 121800Merely a smiling visitor here to share the adore (:, btw fantastic style and design . 941042
827688 506906Simply a smiling visitor here to share the enjoy (:, btw excellent style and design . 14189