Switch to English

లాక్‌డౌన్‌కి 100 రోజులు.. ఏం సాధించాం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

కరోనా వైరస్‌ (కోవిడ్‌19) నేపథ్యంలో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అమల్లో వుంది. రేపటితో లాక్‌డౌన్‌కి 100 రోజులు పూర్తి కానున్నాయి. ఈ వంద రోజుల్లో లాక్‌డౌన్‌కి సంబంధించి ఐదు దశల్ని మనం చూశాం. సంపూర్ణ లాక్‌డౌన్‌ నుంచి.. సడలింపుల లాక్‌డౌన్‌ వరకూ.. చాలా చాలా జరిగాయి. ‘ప్రాణం కంటే ఏదీ గొప్పది కాదు..’ అని చెప్పిన పాలకులే, ఆ తర్వాత ‘ప్రాణంతోపాటు.. అన్నీ ముఖ్యమే..’ అనే స్థాయికి తమ స్టాండ్‌ని మార్చుకోవాల్సి వచ్చింది. తక్కువ కేసులున్నప్పుడు కరినమైన లాక్‌డౌన్‌.. కేసుల సంఖ్య విపరీతంగా పెరిగాక.. ‘నామ మాత్రపు’ లాక్‌డౌన్‌.. వెరసి, సామాన్యుల్ని పూర్తిగా ప్రమాదంలో పడేశాయి ప్రభుత్వాలు.. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.

పేదలకు నెలవారీ రేషన్‌ సరుకులు, నగదు బదిలీ.. తదితర కార్యక్రమాల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టినా.. అవి సామాన్యుడికి కనీసపాటి ఊరట కూడా ఇవ్వలేదన్నది నిర్వివాదాంశం. రెక్కాడితేగాని డొక్కాడని బతుకులు.. సడలింపుల నేపథ్యంలో రోడ్డెక్కాయి. నిజానికి, కొన్ని ప్రాణాలు కరినమైన లాక్‌డౌన్‌ సమయంలోనే గాల్లో కలిసిపోయాయి. గత కొద్ది రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణాలకు పాల్పడుతున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఆ రంగం.. ఈ రంగం.. అన్న తేడాల్లేవు. అన్ని రంగాలూ కరోనా దెబ్బకి విలవిల్లాడుతున్నాయి.

ప్రధాని నరేంద్ర మోడీ ఆత్మ నిర్భర భారత్‌ అభియాన్‌.. పేరుతో 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు ఈ లాక్‌డౌన్‌ నేపథ్యంలోనే. కానీ, ఏం లాభం.? నేతి బీరకాయలో నెయ్యి చందాన తయారయ్యింది ఆ ప్యాకేజీ. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీతో ఎవరికి లబ్ది.? అన్న విషయమై ఇప్పటికీ స్పష్టత లేదు. బ్యాంకులు మారటోరియం ప్రకటించేలా కేంద్రం చర్యలు తీసుకుందిగానీ.. ఆ బ్యాంకులు ఎక్కువ కాలం ఆ భారాన్ని మోయలేవు కదా.! అందుకే, సామాన్యుడి మీద విరుచుకుపడుతున్నాయి క్రమక్రమంగా. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు జోరందుకున్నాయి.. అంతకన్నా జోరందుకున్నాయి కరోనా పాజిటివ్‌ కేసులు.

మళ్ళీ లాక్‌డౌన్‌ అమలు చేయాలన్న చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్‌ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. రేపో మాపో తెలంగాణ కూడా లాక్‌డౌన్‌ పొడిగింపుపై స్పష్టత ఇచ్చే అవకాశం వుంది. ఆంధ్రప్రదేశ్‌ మాత్రం, కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి వుంటామంటోంది. కేసులు పెరుగుతున్న కొద్దీ కంటెయిన్‌మెంట్‌ జోన్లు పెరుగుతున్నాయి.. అయితే, ఇదివరకట్లా ఎక్కువ పరిధిలో కంటెయిన్‌మెంట్‌ జోన్‌ వుండటంలేదు. కొన్ని చోట్ల ఓ ఇంటిని ‘కంటెయిన్‌మెంట్‌’గా ప్రకటించి ఊరుకుంటున్నారు.

తద్వారా తీవ్రతను తగ్గించి చూపేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నా.. కేసుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ జనంలో భయాందోళనలు పెరిగిపోతున్నాయి. కరోనా చికిత్సలో మెరుగైన ఫలితాలిస్తున్నాయంటూ కొన్ని మందులు మార్కెట్‌లోకి వచ్చాయి. అయితే అవన్నీ అత్యంత ఖరీదైనవి. వ్యాక్సిన్‌ వస్తే తప్ప, కరోనా బూతం నుంచి బయటపడే ప్రసక్తే లేదన్నది నిష్టురసత్యం. కానీ, అదెప్పుడు.? ఈలోగా సామాన్యుడి పరిస్థితేంటి.? కుదేలైపోయిన ఆయా రంగాలు.. భవిష్యత్తు మీద బెంగతో సామాన్యుడి ఆలోచనలు.. వెరసి, ఈసారి 100 రోజుల మార్క్‌ని చూసి బెంబేలెత్తిపోవాల్సి వస్తోందంతే.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...