జీవితంలో అన్నీ అనుకున్నట్టు జరగవు. కానీ.. బాధపడకుండా అందినవాటితో సంతోషంగా ఉండాలి. చావును కూడా సంతోషంగా స్వీకరించాలి. నా భర్తకు స్వేచ్ఛ కావాలన్నాడు. నేను అల్లా వద్దకు వెళ్లిపోతున్నా. నాకు అక్కడైనా స్వర్గంలో చోటు దొరుకుతుందో లేదో తెలీదు. చలో.. అల్విదా..! అంటూ సబర్మతీ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుందో వివాహిత. గుజరాత్ లోని అహ్మదాబాద్‌కు చెందిన అయేషాకు రాజస్థాన్‌లోని జాలోర్‌కు చెందిన ఆరిఫ్ ఖాన్‌తో 2018లో వివాహమైంది.
పెళ్లైన కొద్ది రోజులకే అత్తింటి నుంచి వరకట్న వేధింపులు మొదలయ్యాయి. డబ్బుతోనే తిరిగి రావాలని భర్త ఆరిఫ్ 2019లో ఆమెను పుట్టింట్లో వదిలేసాడు. డబ్బుతో రాకపోతే ఏదైనా నదిలో దూకి చావు అని అన్నాడు. దీంతో అయేషా అంత పనీ చేసింది. సబర్మతీ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు బ్రిడ్జిపై కూర్చొని ఓ సెల్ఫీ వీడియో తీసుకుని తన బాధను వెలిబుచ్చింది. విషయం తెలిసుకున్న కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫైర్ బ్రిగేడియర్స్ సాయంతో గాలించి అయేషా మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
978584 511261the most common table lamp these days nonetheless use incandescent lamp but some of them use compact fluorescent lamps which are cool to touch.. 819347
642467 670829You completed various good points there. I did a search on the theme and discovered the majority of folks will consent together with your weblog. 21991
596960 5876amazing post, extremely informative. I wonder why the other experts of this sector do not notice this. You ought to continue your writing. Im certain, youve a terrific readers base already! 873645