మెగా ఫ్యామిలీకి చెందిన అమ్మాయిల్లో నిహారికకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఆమె నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. మల్టీ ట్యాలెంటెడ్ గా నిహారికను అంటూ ఉంటారు. అలాంటి నిహారిక ఇటీవలే చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది. వైవాహిక జీవితంను ఎంజాయ్ చేస్తున్న నిహారికకు ఉన్నట్లు ఉండి కాలికి గాయం అయినట్లుగా తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోను బట్టి అర్థం అవుతుంది. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది.
ఒక వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గొంటున్న సమయంలో నిహారిక కాలు ప్యాశ్చర్ అయినట్లుగా తెలుస్తోంది. దాంతో ఆమెకు కళ్యాణ్ దేవ్ సపర్యలు చేస్తున్నాడు. ఆమె పూర్తిగా బెడ్ కే పరిమితం అవ్వాలని, వారం వరకు విశ్రాంతి తీసుకుంటే మంచిదని వైధ్యులు సలహా ఇచ్చారట. అందుకే నిహారిక తన భర్త చైతన్యతో ఇలా సపర్యలు చేయించుకుంటూ ఉంది. అప్పుడప్పుడు ఇలా భర్తతో సపర్యలు చేయించుకుంటూ ఉంటే అన్యోన్యత పెరుగుతుంది. కనుక నిహారిక ఈ అవకాశంను సద్వినియోగం చేసుకోవాలంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
598640 823422Hiya! awesome weblog! I happen to be a daily visitor to your internet site (somewhat much more like addict ) of this internet site. Just wanted to say I appreciate your blogs and am seeking forward for more to come! 20418