Switch to English

జగన్ దూకుడుతో కేసీఆర్ కు ఇబ్బందులు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దూకుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఇబ్బందిగా పరిణమించిందా? జగన్ వరుసపెట్టి తీసుకుంటున్న నిర్ణయాలు కేసీఆర్ కు మింగుడుపడటం లేదా? ప్రస్తుత పరిణామాలు అలాగే ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత మిగులు రాష్ట్రంగా తెలంగాణ, లోటు రాష్ట్రంగా ఏపీ ఉన్నాయి. విభజన తర్వాత తెలంగాణ కేసీఆర్ పాలనా పగ్గాలు చేపట్టగా.. ఏపీలో చంద్రబాబు సీఎం అయ్యారు. దేశంలోనే ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులూ ఎదురు కాలేదు. సంక్షేమ కార్యక్రమాల అమలుకూ అడ్డంకులు కలగలేదు. దీంతో రైతుబంధు వంటి పథకాలు ప్రభుత్వానికి పేరు తెచ్చాయి.

ఇక లోటు రాష్ట్రంగా ఉన్న ఏపీలో ఏ కార్యక్రమం చేపట్టాలన్నా నిధుల సమస్య అడ్డంకిగా మారింది. దీంతో సంక్షేమ పథకాల అమలు అంతగా జరగలేదు. రుణమాఫీ, డ్వాక్రా రుణాల రద్దు.. ఇలా తెలుగుదేశం పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు చాలామటుకు అమలుకాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రజలు తెలంగాణతో పోల్చుకుని బాధపడేవారు. ప్రస్తుతం పరిస్థితి మారింది. ఏపీలో పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే జగన్ దూకుడుగా ముందుకెళ్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా అన్ని వర్గాలపైనా వరాల జల్లు కురిపిస్తున్నారు. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పాలనను ఉరకలెత్తిస్తున్నారు.

ముఖ్యంగా అవినీతి మరక అంటితే, మంత్రుల పోస్టు కూడా పీకేస్తానని స్పష్టంగా చెప్పేశారు. పదవీకాలం రెండున్నరేళ్లు కూడా గ్యారెంటీ కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. అలాగే మంత్రులకు తెలియకుండా ఏ విషయం ఉండకూడదని, ఏ విషయమైనా ముందుగా మంత్రుల వద్దకు వెళ్లిన తర్వాతే తన వద్దకు వస్తుందని, తద్వారా తన కేబినెట్ లో మంత్రులు డమ్మీలు కాదనే విషయాన్ని పేర్కొన్నారు. ఇక తొలి కేబినెట్ భేటీలోనే అన్ని వర్గాలపై వరాల జల్లు కురిపించారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఐఆర్ పెంపుపై వెంటనే నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు ఐఆర్ 27 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగులే ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంత త్వరగా ఈ విషయంలో నిర్ణయం వెలువడుతుందని అనుకోలేదని పేర్కొంటున్నారు.

అలాగే నష్టాల ఊబిలో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా చర్యలు మొదలయ్యాయి. ఇలా ఏపీలో కొత్త సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. అసలు డబ్బులే లేని రాష్ట్రం తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణలో ఎందుకు తీసుకోవడంలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఉద్యోగులకు ఐఆర్ పెంచాలన్న డిమాండ్ తెలంగాణలో చాలాకాలం నుంచి పెండింగ్ లో ఉంది. అలాగే ఆర్టీసీ విషయంలో కూడా కేసీఆర్ ప్రభుత్వ వైఖరికి, జగన్ సర్కారు నిర్ణయానికి చాలా తేడా ఉందనే పోలికలు ప్రారంభమయ్యాయి.

గతంలో ఆర్టీసీ సమ్మె నోటీసు ఇచ్చినప్పుడు సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. అవసరమైతే ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తానని హెచ్చరించారు. నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు కూడా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో డొక్కు బస్సులతోనే తెలంగాణ ఆర్టీసీ మనుగడ సాగిస్తోంది. ఇక అవినీతి విషయంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకున్న పరిస్థితి లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ నిర్ణయాలతో పోల్చుకోవడం తెలంగాణలో ప్రారంభమైంది. ఈ పరిణామాలు తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఇబ్బందిగా పరిణమించాయి.

Related Posts

జగన్‌కి వ్యతిరేకంగా ‘స్కెచ్‌’ రెడీ చేస్తున్న మోడీ

జనసేనానికి సొంత నియోజకవర్గమెక్కడ!

మోడీకి వంగి వంగి దండాలెట్టాలా వైఎస్‌ జగనూ!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...