Switch to English

కృష్ణ కృష్ణా.. కేసీఆర్‌, జగన్‌ మధ్య ‘సీమ’ చిచ్చు చల్లారేదెలా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

కృష్ణా నది నుంచి రాయలసీమకు నీళ్ళు తీసుకెళ్ళేందుకోసం రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఓ గట్టి సంకల్పం ఈ మధ్యనే తీసుకున్న విషయం విదితమే. దీన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. అవసరమైతే, ఆంధ్రప్రదేశ్‌ మీద న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించింది కూడా. అయితే, ‘మా వాటా నీళ్ళను మేం వాడుకుంటాం.. అదనంగా మేమేమీ కృష్ణా నది నుంచి నీళ్ళను తీసుకెళ్ళబోం.. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు..’ అని తేల్చి పారేశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి.

‘అలా ఎలా చేస్తారు.? కృష్ణా నదిపై ప్రాజెక్టులు నిర్మించాలంటే, ఎగువన వున్న మా అనుమతి తప్పనిసరి.. తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌ వెనుక నీటి వివాదాలే అత్యంత కీలక భూమిక పోషించాయి. ఇప్పుడూ ఆ నీటి వివాదాలు వస్తే ఎలా.?’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుండబద్దలుగొట్టేశారు. అయితే, తెలంగాణ అభ్యంతరాల్ని బేఖాతరు చేస్తే, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, టెండర్ల ప్రక్రియవైపు పరుగులు పెడ్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం, సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాయలసీమ ప్రాజెక్టుని ఆపాలంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం, సుప్రీంకోర్టుని కోరింది. దాంతో, ఈ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

గతంలో పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్‌ విషయంలో తెలంగాణ, సీమాంధ్ర మధ్య (ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో) వివాదం నెలకొంది. ఆ వివాదంపై ఇప్పటికీ రాజకీయ రచ్చ జరుగుతూనే వుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాయలసీమ ప్రాజెక్ట్‌ పేరుతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వంతో వివాదాలు ఎందుకు కొనితెచ్చుకుంటున్నట్లు.? ‘రెండు తెలుగు రాష్ట్రాలూ సఖ్యతతో కృష్ణా – గోదావరి నదుల్లోని నీటిని వాడుకుందాం.. గోదావరి నుంచి నీటిని ఎత్తి పోసి, కృష్ణా నదిలో కలుపుకుని.. వాడుకుందాం..’ అంటూ కేసీఆర్‌, జగన్‌ మధ్య ఉన్నతస్థాయి చర్చలు జరిగాయి. ‘నేను అన్న లాంటోడ్ని..’ అని కొన్నాళ్ళ క్రితం రాయలసీమకు వెళ్ళిన సమయంలో కేసీఆర్‌ వ్యాఖ్యానించారు కూడా. కానీ, ఇప్పుడు ఏమయ్యింది.? కేసీఆర్‌, జగన్‌ మధ్య ఎక్కడ తేడా కొట్టింది.?

‘న్యాయస్థానాల్లో పంచాయితీలు తొందరగా తేలవు.. అందుకే, ఇరు రాష్ట్రాలూ కూర్చుని చర్చించుకోవాలి..’ అని గతంలో చెప్పిన కేసీఆర్‌, ఇప్పుడెందుకు ఇలా వ్యవహరిస్తున్నారు.? మరి, ‘పెద్దన్న’ విషయంలో వైఎస్‌ జగన్‌ వెనక్కి తగ్గుతారా.? అసలు ఇది కేవలం రాజకీయ రచ్చ మాత్రమేనా.? రాయలసీమ పట్ల వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటూ విపక్షాలు చేస్తున్న విమర్శల్లో నిజమెంత.? ఏమో, ఈ వివాదం ఎక్కడిదాకా వెళుతుందోగానీ.. తెలుగు రాష్ట్రాల మధ్య మళ్ళీ ‘నీళ్ళు’ నిప్పులు రాజేసేలా వున్నాయనే ఆందోళన మాత్రం ఇరు రాష్ట్రాల ప్రజల్లోనూ వ్యక్తమవుతోంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...