Switch to English

కేసీఆర్ క్లారిటీ ఇచ్చేశారు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

పార్టీలో నెలకొన్న పరిస్థితికి, వరుసగా బయటకు వస్తున్న అసంతృప్తులకు టీఆర్ఎస్ అధినేత ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. శాసనసభ వేదికగా దాదాపు మూడు గంటలపాటు సాగిన మారథాన్ ప్రసంగంలో పలు అంశాలపై స్పష్టత ఇచ్చారు. అంత్య ప్రాసలు, అలంకారాలతో తనపై తానే జోకులతో ప్రస్తుతం చెలరేగిన ఊహాగానాలకు జవాబిచ్చారు. మరో పదేళ్లు తానే సీఎంగా ఉంటానని, ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలూ అవసరం లేదని స్పష్టంచేశారు.

కేసీఆర్ దిగిపోయి కేటీఆర్ ను ఎక్కించే ఆలోచన తనకు లేదని చెప్పారు. కేబినెట్ విస్తరణ తర్వాత పార్టీలో లుకలుకలు బయలుదేరిన సంగతి తెలిసిందే. గులాబీ పార్టీలో ఏదో జరుగుతోందనే సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. దీంతో అప్రమత్తమైన గులాబీ దళపతి నేరుగా రంగంలోకి దిగి వ్యూహాత్మకంగా అన్ని అంశాలకూ జవాబిచ్చారు. తద్వారా పార్టీలో మరింత అసంతృప్తి ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

Also Read: చంద్రబాబుకీ, కేసీఆర్‌కీ ఎక్కడ చెడిందంటే..

అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్.. ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అనంతరం దేశ రాజకీయాలపై దృష్టి పెట్టిన ఆయన.. తెలంగాణలో 16 సీట్లనూ గెలుచుకుని కేంద్రంలో చక్రం తిప్పుదామని భావించారు. కేంద్రంలో ఎలాగూ హంగ్ వస్తుందని, అప్పుడు మనమే కీలకం అవుతామని అనుకున్నారు. కుమారుడు కేటీఆర్ కి పాలనా పగ్గాలు అప్పగించి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని యోచించారు. కానీ పరిస్థితి తేడా కొట్టి 9 సీట్లకే పరిమితమయ్యారు.

దేశంలో ఎన్డీఏకి తిరుగులేని మెజార్టీ రావడంతో ఆయన ఆలోచనలు ఫలించలేదు. అయినప్పటికీ, త్వరలో కేటీఆర్ ని సీఎం చేస్తారనే ఊహాగానాలు బలంగా సాగాయి. ఇది పార్టీలో చాలామంది సీనియర్లకు రుచించలేదు. అదే సమయంలో హరీశ్ రావును పక్కనపెట్టడం కూడా నచ్చలేదు. ఈ పరిణామాలన్నీ కొంతమంది నేతల్లో గూడు కట్టుకుని ఉండిపోయాయి. మరోవైపు కేటీఆర్ సైతం పార్టీలో తన టీంను తయారు చేసుకునే పనిలో నిమగ్నమైపోయారు. సీనియర్లను కాస్త దూరం పెట్టి, తనకు కావాల్సినవారినే దగ్గరకు తీయడం పార్టీలో అంతర్గత విభేదాలకు దారి తీసింది.

ఇదే తరుణంలో కేబినెట్ విస్తరణకు సంబంధించి మంత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్ మరింత ఆజ్యం పోసింది. మరోవైపు వీటిని తమకు అనుకూలంగా మలుచుకుని టీఆర్ఎస్ ను నిర్వీర్యం చేయాలని బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో పార్టీలో రేగిన అసంతృప్తిని చల్లార్చేందుకు, ఇతర నేతలు ఎవరూ ప్రలోభాలకు గురి కాకుండా ఉండేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా శాసనసభనే వేదికగా చేసుకుని అన్ని అంశఆలపై స్పష్టత ఇచ్చారని అంటున్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...