మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల హంగామా మొదలైంది. ఈసారి మా అధ్యక్షుడి ఎన్నికల రేసులో మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ, ప్రకాష్ రాజ్ లు పోటీ పడుతున్నారు. నలుగురు ప్రముఖులు రేసులో ఉండడంతో పోటీ రసవత్తరంగా మారింది.
ఇదిలా ఉంటే ఈరోజు ఉదయం నుండి నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఎన్నికల రేసులో ఉన్నట్లు, అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నట్లు ప్రచారం జరిగింది. దీనిపై కొంత కన్ఫ్యూజన్ ఏర్పడడంతో కళ్యాణ్ రామ్ టీమ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు.
రూమర్స్ ను నమ్మవద్దని, కళ్యాణ్ రామ్ మా ఎన్నికలలో పోటీ చేయట్లేదని, ఆ రూమర్స్ లో ఏ మాత్రం నిజం లేదని స్పందించారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ భీంబిసిరా అనే భారీ పీరియాడిక్ ఫిక్షనల్ డ్రామా చేస్తున్నాడు. క్యాథెరిన్, సంయుక్త మీనన్ ఈ సినిమాలో నటిస్తున్నారు.
185314 267461Deference to internet site author , some great entropy. 573572