Switch to English

జనసేన పవర్ పంచ్: రిగ్గింగ్ కూడా నవరత్నాల్లో భాగమేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

తిరుపతి ఉప ఎన్నిక కోసం దొంగ ఓటర్ ఐడీ కార్డులు ముద్రించి ఎక్కడెక్కడినుంచో జనాన్ని తోలుకొచ్చి, క్యూలో నిలబడితే, ఓటరుని మీ తండ్రి పేరు ఏమిటని అడిగితే చెప్పలేకపోయారు. ఓ మహిళను నీ భర్త పేరు ఏమిటని అడిగితే తడబడ్డారు. తండ్రి, భర్త ఎవరో తెలియని దుస్థితికి కూలికి వచ్చిన దొంగ ఓటర్లకు కల్పించారు వైసీపీ నేతలు.. ఇలా దొంగ ఓట్లు వేయించడం కూడా ముఖ్యమంత్రి జగన్ రెడ్డిగారు నవరత్నాల్లో భాగం అనుకోవాలా.?’ అంటూ జనసేన పార్టీ, అధికార వైసీపీ మీద పవర్ పంచ్ విసిరింది. ‘తిరుపతి ఎన్నికల గురించి దేశమంతా చర్చించుకోవాలి.. ఆ స్థాయిలో మెజార్టీ రావాలి..’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబితే, అది వైసీపీ నాయకులకు ఇంకోలా అర్థమయినట్లుంది.

 

లేకపోతే, ‘ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోతోంది ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో.. ఓసారిటు చూడండి..’ అంటూ దేశమంతా తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ రోజే చర్చించుకోవడమేంటి.? ‘మేమెప్పుడూ ప్రజాస్వామ్యం ఇంత పతన స్థాయికి పడిపోవడం చూడలేదు..’ అని సగటు భారతీయుడు, ఆంధ్రపదేశ్ వైపు అత్యంత జుగుప్సాకరంగా చూడటం, తిరుపతి ఉప ఎన్నిక గొప్పతనం అనుకోవాలేమో. జనసేన విమర్శించిందని కాదుగానీ, ఏ మహిళ అయినా తన భర్త పేరుని తప్పుగా చెప్పగలుగుతుందా? ఏ వ్యక్తి అయినా తన తండ్రి పేరుని తప్పుగా చెప్పగలుగుతాడా.? వైసీపీ, అంత పెద్ద తప్పుని దొంగ ఓటర్లతో చెప్పించగలిగింది. ఇదీ, ఆంధ్రపదేశ్ పరువుని బజార్న పడేయడమంటే. ఇక, తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలంటూ జనసేన, బీజేపీ నినదిస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామంటున్నాయి. ‘అధికారులు కళ్ళున్న గుడ్డివారిలా నటిస్తే ప్రజాస్వామ్యం మనజాలదు.

 

ఈ తిరుపతి ఉప ఎన్నిక జరిగిన రోజు దేశ ప్రజాస్వామ్యానికి దుర్దినం..’ జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. నిజమైన ఓటర్లు, ఓట్లేయలేని పరిస్థితి వున్నప్పుడు, అసలు తిరుపతిలో ఉప ఎన్నిక జరిగిందని ఎలా అనగలం.? దొంగ ఓటర్లను బస్సుల్లో, ప్రత్యేక వాహనాల్ని తరలించారంటే, ఇది అధికార వైసీపీకి సంబంధించిన ఓ రాజకీయ కార్యక్రమంలానే చూడాలి తప్ప, తిరుపతి ఉప ఎన్నికలా చూడకూడదన్నది సర్వత్రా విన్పిస్తోన్న వాదన.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....