Switch to English

కేసీఆర్-జగన్ స్నేహగీతిక సాగేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

శత్రువు శత్రువు మిత్రుడంటారు. అదే సూత్రంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మధ్య చక్కని సంబంధాలు నెలకొన్నాయి. 2014 ఎన్నికల్లోనే తెలంగాణలో తాము, ఏపీలో జగన్ అధికారంలోకి వస్తామంటూ కేసీఆర్ జోస్యం చెప్పారు. అయితే, తెలంగాణలో బొటాబొటీ మెజార్టీతో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటైనా.. ఏపీలో మాత్రం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య అంతగా సత్సంబంధాలు నెలకొనలేదు. విభజన సమస్యలతోపాటు పలు అంశాలు పరిష్కారం కాకుండా అలాగే ఉండిపోయాయి.

ఈ నేపథ్యంలో కేసీఆర్ తెలివిగా వ్యవహరించి ముందుస్తు ఎన్నికలకు వెళ్లి భారీ మెజార్టీతో విజయం సాధించారు. అనంతరం ఏపీలో జగన్ గెలుపొందడంతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. జగన్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ వెళ్లడం.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ రావడం.. పలుమార్లు ఇరువురూ భేటీ అయి పలు అంశాలపై చర్చించి, విభజన సమస్యల పరిష్కారానికి కృషి చేయడం వంటి పరిణామాలు జరిగాయి. అయితే, ఆయా అంశాలన్నీ తెలంగాణకు అనుకూలంగా ఉన్నవేనని, ఏపీకి ఒరిగిన లాభమేదీ లేదనే విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఈ విమర్శలు ఇలా కొనసాగుతండగా.. రెండు రాష్ట్రాలు కలిసి గోదావరి-కృష్ణా అనుసంధాన ప్రాజెక్టు ప్రారంభించాలని భావించాయి. ఇది కూడా తెలంగాణకే లబ్ధి చేకూరుస్తుందనే వాదనల నేపథ్యంలో జగన్ కాస్త వెనక్కి తగ్గారు. దీంతో క్రమంగా ఆ ప్రాజెక్టు అటకెక్కిపోయింది. అనంతరం ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని జగన్ ప్రకటించడం.. తెలంగాణలో కూడా ఆ డిమాండ్ వచ్చి రెండు నెలలపాటు సమ్మె జరగడం.. ఈ సందర్భంగా ఏపీలో ఆర్టీసీ వ్యవహారంపై కేసీఆర్ విమర్శలు చేయడం వంటి పరిణామాలు రెండు రాష్ట్రాల సీఎంల మధ్య కాస్త దూరాన్ని పెంచాయి.

ఈ నేపథ్యంలో తాజాగా పోతిరెడ్డిపాడు ఎత్తు పెంచుతానని జగన్ అసెంబ్లీలో ప్రకటించడం కేసీఆర్ కు మరింత ఇబ్బందిగా పరిణమించింది. ఆది నుంచి రెండు ప్రాంతాల మధ్య వివాదాస్పదంగా నిలిచిన ఈ ప్రాజెక్టు మరోసారి తెరపైకి రావడంతో అప్పుడే కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు మొదలయ్యాయి. ఇది కూడా జగన్ తో దూరం పెంచే అంశంగానే కనిపిస్తోంది.

మరోవైపు దిశ ఎన్ కౌంటర్ విషయంలో కేసీఆర్ కు హ్యాట్సాఫ్ అంటూ జగన్ అసెంబ్లీలో ప్రశంసించారు. వైసీపీ అధినేత మంచి ఉద్దేశంతోనే గులాబీ బాస్ ను ప్రశంసించినా.. ఒక విధంగా అది కేసీఆర్ ను ఇరుకున పెట్టేలా ఉంది. ఆయనే ఈ ఎన్ కౌంటర్ చేయించిన అర్థం వచ్చేలా అనిపిస్తోంది. ఈ పరిణామాలన్నీ రెండు రాష్ట్రాల సీఎంల సంబంధాలపై ప్రభావం చూపుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎక్కువ చదివినవి

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...