Switch to English

కేసీఆర్, జగన్.. ఆచితూచి అడుగులు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

ఎన్నికల ఫలితాల విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది. సరిగ్గా 6 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఆదివారం చివరి విడత పోలింగ్ పూర్తికాగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలవుతాయి. ఇప్పటికే తమ విజయావకాశాలపై పార్టీలన్నీ దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చాయి. అందుకు అనుగుణంగానే భవిష్యత్ కార్యాచారణపై దృష్టి సారించాయి. ఫలితాలు రాకముందే తమకు అక్కరకు వచ్చే అవకాశం ఉందని భావించే పార్టీలకు కాంగ్రెస్, బీజేపీలు గేలం వేస్తున్నాయి. ఈ విషయంలో యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ స్వయంగా రంగంలోకి దిగారు.

బీజేపీ కంటే ఓ అడుగు ముందుకు వేసి, ఫలితాలు విడుదలయ్యే ఈనెల 23న యూపీఏ అనుకూల, తటస్థ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ భేటీకి రావాలంటూ ఆయా పార్టీల అధినేతలకు లేఖలు రాశారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా ఆమె ఆహ్వానం పంపినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, వీటిని ఆయా పార్టీలు ఖండించాయి. తమకు కాంగ్రెస్ నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదని స్పష్టంచేశాయి. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్ తో అంటకాగుతున్న నేపథ్యంలో కేసీఆర్, జగన్ ఆ భేటీకి వెళ్లే అవకాశం లేదని అంటున్నారు. ఇద్దరికీ శత్రువు అయిన చంద్రబాబు ఉండే కూటమిలోకి వెళ్లడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ వారికి ఇష్టం ఉండదని చెబుతున్నారు.

అంతేకాకుండా ఫలితాలు పూర్తి స్థాయిలో వెల్లడైన తర్వాత, అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని ఈ ఇరువురు నేతలు భావిస్తున్నట్టు సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని, ఆంధ్రప్రదేశ్ లో 18 నుంచి 20 సీట్లు వైఎస్సార్ సీపీ గెలుస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ రెండు పార్టీలను కలుపుకొంటే కనీసం 32 నుంచి 34 సీట్లు చేతిలో ఉన్నట్టే. ఈసారి కేంద్రంలో హంగ్ ఏర్పడటం ఖాయమనే ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ రెండు పార్టీల మద్దతు ఎవరికి ఉంటే వారే అధికారం చేజిక్కించుకునే అవకాశం ఉంటుంది.

ఈ నేపథ్యంలోనే అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ కూడా టీఆర్ఎస్, వైఎస్సార్ సీపీలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాల్లో బిజీగా ఉన్న కేసీఆర్.. ప్రస్తుతానికి వాటికి ఫుల్ స్టాప్ పెట్టినట్టు సమాచారం. ఇటీవల డీఎంకే అధినేత స్టాలిన్ తో భేటీ అంతగా పలప్రదం కాకపోవడంతో ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాలని నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతున్నారు. ఇక జగన్ అయితే, తొలి నుంచి చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. తర్వాత పెద్దగా ఎక్కడా కనిపించలేదు. విజయం వైసీపీదే అంటూ ఎన్ని సర్వేలు వచ్చినా ఆయన మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎవరికీ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడంలేదు. ఏ విషయమైనా ఫలితాలు వచ్చాక మాట్లాడుకుందాం అని స్పష్టంచేస్తున్నట్టు సమాచారం.

గత ఎన్నికల్లో విజయం తమదే అని అతి విశ్వాసం కనబరచడం.. ఫలితాలు విరుద్ధంగా రావడంతో, ఈ సారి ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఎక్కడా తొందరపడకుండా, ఫలితాలు వచ్చాక చూద్దామనే ధోరణినే జగన్ కంటిన్యూ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యూపీఏ భేటీకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఫలితాలు వచ్చిన తర్వాత, అప్పటి పరిణామాలను బట్టి స్పందించాలన్నది జగన్ వ్యూహంగా చెబుతున్నారు. మొత్తమ్మీద గత ఎన్నికల్లో చేసిన ఏ పొరపాటునూ పునరావృతం కానీయకుండా ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నారని అర్థమవుతోంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

ఎక్కువ చదివినవి

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...