Switch to English

కోడెలా.. చొక్కా చిరిగిందెలా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత కోడెల శివ ప్రసాద్‌ ‘చొక్కా చిరిగిన వైనం’ గత కొద్ది రోజులుగా రాజకీయ దుమారానికి కారణమైంది. ఎన్నికల పోలింగ్‌ జరుగుతుండగా, కోడెల శివ ప్రసాద్‌ తాను పోటీ చేస్తున్న నియోజక వర్గంలోని ఓ పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లడం, ఆయనపై దాడి జరగడం.. ఈ క్రమంలో కోడెల శివ ప్రసాద్‌ సొమ్మసిల్లి పడిపోవడం తెలిసిన విషయాలే. దాడి జరగలేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అంటోంది. జరిగిన దాడి హేయమనీ తెలుగుదేశం పార్టీ మండిపడుతోంది. అసలేం జరిగింది.?

పోలింగ్‌ బూత్‌లోకి పోటీ చేస్తున్న అభ్యర్ధి వెళ్లడం నేరమేమీ కాదు. అది అతని హక్కు. కోడెల కూడా ఆ హక్కుతోనే పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లారు. అయితే, రిగ్గింగ్‌ చేయడానికే కోడెల శివ ప్రసాద్‌ పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం కోడెల సొంతం. హోం మంత్రి సహా అనేక కీలక పదవుల్ని తన రాజకీయ జీవితంలో అనుభవించారాయన. స్పీకర్‌గా మరింత గౌరవప్రదమైన పదవిలో ప్రస్తుతం ఉన్న కోడెల శివ ప్రసాద్‌ సిల్లీగా రిగ్గింగ్‌ చేస్తారని ఎలా అనుకోగలం.? అయితే గత కొద్ది కాలంగా కోడెల సొంత నియోజక వర్గంలో చోటు చేసుకున్న పరిణామాల్ని విశ్లేషిస్తే తీవ్ర వ్యతిరేకత కారణంగానే ఇదంతా జరిగిందనే విషయం అర్ధమవుతుంది.

గ్రామస్థులు కోడెలపై అనుమానంతో ఆగ్రహావేశాలకు లోనయ్యారనీ, ఈ క్రమంలోనే దాడి జరిగిందనీ కోడెల రాజకీయ ప్రత్యర్ధి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. అయితే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ వాదన మాత్రం ఇంకోలా ఉంది. గవర్నర్‌ నరసింహన్‌ని కలిసిన అనంతరం వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ కోడెల తన చొక్కా తానే చించేసుకున్నారనీ, దాడి జరిగిందంటూ నాటకమాడారనీ చెప్పారు. ఇదే విషయాన్ని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారట జగన్‌. రాజకీయాలు ఎంతలా దిగజారిపోయాయో చెప్పడానికి ఇదొక నిదర్శనం.

కొన్నాళ్ల క్రితమే వై ఎస్‌ జగన్‌ మీద విశాఖపట్నంలో హత్యాయత్నం జరిగింది. దీన్ని అధికార తెలుగుదేశం పార్టీ చాలా వెటకారం చేసింది. కొందరు టీడీపీ నేతలైతే పబ్లిసిటీ కోసమే పెద్ద నాటకమాడారంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై ఎదురు దాడి చేశారు. ఇంకొందరు తెలుగు తమ్ముళ్లు ఇంకాస్త అత్యుత్సాహం చూపి, జగన్‌ మీద అతని కుటుంబ సభ్యులే దాడి చేయించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అప్పుడు టీడీపీ నేతలు తనపై జరిగిన దాడిని ఎగతాళి చేశారు గనుక, ఇప్పుడు కోడెలపై జరిగిన దాడిని తాను చులకన చేయాలనుకోవడం ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవాలనుకుంటోన్న జగన్‌కి తగదు. టీడీపీ చేసిన తప్పే జగన్‌ చేస్తానంటే ఇక ప్రజల ముందు నేను భిన్నమైన నాయకుడిని, విశ్వసనీయత కలిగిన వాడిని అని జగన్‌ ఎలా చెప్పుకోగలరు.?

కోడెలపై దాడి జరిగిన మాట వాస్తవం. ఆయన వాహనంపై రాళ్లు రువ్విన మాట వాస్తవం. కోడెలకు రాజకీయ ప్రత్యర్థి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీనే. ఇప్పటికే పోలీసులు ఈ కేసులో పలువురు వైసీపీ కార్యకర్తలు, నేతలపై కేసులు నమోదు చేశారు. అదే సమయంలో కోడెల శివ ప్రసాద్‌పైనా కేసులు నమోదయ్యాయి. కొన్ని ఆరెస్టులూ జరుగుతున్నాయి. నిజమేంటో ముందు ముందు తెలుస్తుంది. చొక్కా చిరిగిందా.? చింపేశారా.? చింపేసుకున్నారా.? వంటి ప్రశ్నలకు సమాధానాలు త్వరలో ఖచ్చితంగా దొరుకుతాయి. అప్పటిదాకా రాజకీయ నాయకులు విజ్ఞత ప్రదర్శిస్తే ఉద్రిక్తతలు తగ్గుతాయి.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు కూడా వుంటారు. అందుకే, యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో...