Switch to English

‘త్రీడీ’ వెటకారం: అదిరింది రాయుడూ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

ఏ క్రికెటర్‌కైనా ప్రపంచ కప్‌ పోటీల్లో తన దేశానికి ప్రాతినిధ్యం వహించాలనేది జీవిత లక్ష్యంగా ఉంటుంది. మన తెలుగోడు అంబటి తిరుపతి రాయుడు ఇందుకు అతీతమేమీ కాదు. చాలా చిన్న వయసు నుండే క్రికెట్‌లో రాయుడు పేరు మార్మోగిపోతున్నా, జాతీయ జట్టులో అవకాశాలు మాత్రం చాలా కష్టమయ్యాయి ఈ తెలుగు ఆటగాడికి. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా, క్రికెట్‌పై ఉత్తరాది పెత్తనం సుస్పష్టం. ప్రతీసారీ తెలుగు నేలకు క్రికెట్‌ పరంగా అన్యాయం జరుగుతూనే వచ్చిందని చాలా సందర్భాల్లో నిరూపితమైంది.

అజారుద్దీన్‌, వి.వి.యస్‌.లక్ష్మణ్‌, వెంకటపతి రాజు.. ఇలా కొందరు సత్తా చాటినా, చాలా మంది తెలుగు క్రికెటర్లు అవకాశాల కోసం వేచి చూడడంతోనే సరిపెట్టేయాల్సి వచ్చింది. ఒకటీ అరా అవకాశాలు వచ్చినా ఆ తర్వాత వివిధ కారణాలు చూపుతూ వారిని పక్కన పెట్టేసిన ఘటనలు కోకొల్లలు. వేణుగోపాలరావు ఆ జాబితాలోకే వస్తాడు. అంబటి రాయుడు విషయానికి వస్తే, సుదీర్ఘ పోరాటం అనంతరం జాతీయ జట్టులో చోటు దక్కించుకుని కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్‌తో కెరీర్‌ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నించాడు.

కానీ ఏం లాభం.? త్వరలో జరగనున్న వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ పోటీల కోసం ప్రకటించిన తుది భారత జట్టులో చోటు సంపాదించుకోలేకపోయాడు అంబటి రాయుడు. దురదృష్టమేంటంటే, తెలుగు వాడైన ఎమ్‌.ఎస్‌.కె.ప్రసాద్‌ చీఫ్‌ సెలక్టర్‌గా ఉన్నా, అంబటి రాయుడికి చోటు దక్కకపోవడం. తెలుగు వాడు కాబట్టి ఎమ్‌.ఎస్‌.కె.ప్రసాద్‌ చీఫ్‌ సెలక్టర్‌గా సాటి తెలుగువాడైన అంబటి రాయుడికి ఊరికినే సాయం చేయాలనే మాట ఎవరూ అనరు. కానీ అంబటి రాయుడిలో సత్తా ఉంది. మ్యాచ్‌ని మలుపు తిప్పగల టాలెంట్‌ అంబటి రాయుడి సొంతం. మ్యాచ్‌ని అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఎలాంటి పరిస్థితిలోనైనా నిలబెట్టగల దమ్మున్నోడు రాయుడు.

రాయుడి కంటే మిన్నగా ఆడగలడనే నమ్మకంతో విజయ్‌ శంకర్‌ని సెలక్టర్లు ఎంపిక చేయడంపై చాలా విమర్శలు వస్తున్నాయి. ఒత్తిడిని ఏమాత్రం తట్టుకోలేని విజయ్‌ శంకర్‌ వైపు మొగ్గు చూపడం పలు అనుమానాలకు తావిస్తోంది. బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విషయంలో రాయుడు కంటే, విజయ్‌ శంకర్‌ మెరుగైన ప్రదర్శన ఇవ్వగలడన్న సెలక్టర్ల అభిప్రాయాన్ని క్రికెట్‌ అభిమానులు ఎవరూ సమర్ధించడం లేదు. టీమ్‌ ఇండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ సైతం అంబటి రాయుడుకి మద్దతిచ్చాడు. జరిగిన అన్యాయాన్ని సోషల్‌ మీడియా వేదికగా నిలదీశాడు.

ఇదిలా ఉంటే, సోషల్‌ మీడియాలో అంబటి రాయుడు చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ‘త్రీడీ కళ్లద్దాల కోసం ఆర్డర్‌ చేశాను వరల్డ్‌ కప్‌ని చూసేందుకు..’ అని అంబటి రాయుడు ట్వీట్‌ చేశాడు. ఇప్పుడీ ట్వీట్‌ వైరల్‌గా మారింది. వేలాది మంది అభిమానులు అంబటి రాయుడికి బాసటగా నిలిచారు. ‘అన్నా.. నీకు చాలా అన్యాయం జరిగింది. అయినా హుందాగా వ్యవహరించావు. ధైర్యం కోల్పోవద్దు. నీ కష్టమే నీకొక దారి చూపిస్తుంది. అప్పుడే ఆట ముగిసిపోలేదు.. అద్భుతాలు జరుగుతాయి.. ఖచ్చితంగా వరల్డ్‌ కప్‌ పోటీలో భారత జెర్సీలో నిన్ను మేము మైదానంలో చూస్తాం..’ అని అభిమానులు తమ అభిమాన ఆటగాడికి ధైర్యం చెబుతున్నారు.

క్రికెట్‌లో రాజకీయాలు అందరికీ తెలిసినవే. ఆ రాజకీయాలపై సుతి మెత్తగా అంబటి రాయుడు తనదైన స్టైల్‌లో సెటైర్‌ వేసిన వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌.. ఇలా త్రీ డైమన్షన్స్‌లో ఆలోచించి విజయ్‌ శంకర్‌ని ఎంపిక చేశామని చీఫ్‌ సెలక్టర్‌ ఎమ.ఎస్‌.కె చెప్పడాన్ని వెటకారం చేస్తూ రాయుడు ‘త్రీడీ గ్లాసెస్‌’ అనే మాటని తన ట్వీట్‌లో ప్రస్తావించిన వైనం అందరికీ అర్ధమవుతోంది. ఇంతకన్నా తన మనసులోని బాధని రాయుడు ఇంకెలా బయట పెట్టగలడు.?

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

రాజకీయం

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

ఎక్కువ చదివినవి

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....