ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ త్వరలో ప్రారంభం కాబోతోంది. షెడ్యూల్ కూడా వచ్చేసింది. సెప్టెంబర్ 19న ముంబై ఇండియన్స్ – చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్ల మధ్య అబుదాబీలో తొలి మ్యాచ్ జరుగుతుంది. మన టైమ్ ప్రకారం చూసుకుంటే ప్రారంభ వేడుకలు మధ్యాహ్నం 3.30 నిమిషాలకు షురూ అవుతాయ్. మ్యాచ్ మాత్రం రాత్రి 7.30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. 20 మ్యాచ్‌లు దుబాయ్‌లో, 20 మ్యాచ్‌లు అబుదాబీలో, 12 మ్యాచ్‌లు షార్జాలో జరుగుతాయి.
ఒకే రోజు రెండు మ్యాచ్‌లు వుంటే ఒకటి మధ్యాహ్నం 3.30 నిమిషాలకీ, ఇంకోటి రాత్రి 7.30 నిమిషాలకీ ప్రారంభమవుతుంది. ప్లే-ఆఫ్ వేదికల్ని మాత్రం ఖరారు చేయలేదు. నవంబర్ 3 వరకు మ్యాచ్‌ల షెడ్యూల్‌ని విడుదల చేశారు. అంతా బాగానే వుందిగానీ, గతంలోలా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈసారి ప్రేక్షకులకు ‘కిక్’ ఇవ్వగలుగుతుందా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇండియాలో కరోనా వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా వుంది. దాంతో, వేదికని యూఏఈకి మార్చారు. కానీ, అక్కడా కరోనా వైరస్ ప్రభావం కాస్తో కూస్తో వుంది. ఇప్పటికే ఐపీఎల్‌కి సంబంధించి కొంతమంది కరోనా బారిన పడ్డారు. వీరిలో ఆటగాళ్ళతోపాటు, ఇతర సిబ్బందీ వున్నారు. చాలామంది కోలుకున్నారు కూడా.
అయితే, టోర్నమెంట్ మొదలయ్యాక ఎవరన్నా కరోనా బారిన పడితే పరిస్థితి ఏంటి.? ఓ జట్టులో ఓ ఆటగాడికి కరోనా వస్తే, మిగతా అందర్నీ క్వారంటైన్లోకి పంపాల్సిందే. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ళనీ క్వారంటైన్లోకి పంపాలి. మరి, అది సాధ్యమయ్యే పనేనా.? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ‘కరోనా రాదు’ అని గ్యారంటీ ఇచ్చే పరిస్థితే లేదు. మరోపక్క, కరోనాతో ప్రపంచం సతమతమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ క్రికెట్‌ని ఎంజాయ్ చేసే పరిస్థితుల్లో కూడా లేరు.
ఎలా చూసుకున్నా, ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్.. పెద్దగా సందడి చేసే అవకాశాలు కన్పించడంలేదన్నది నిర్వివాదాంశం. అసలు టోర్నమెంట్ పూర్తిగా జరుగుతుందా.? మధ్యలోనే అటకెక్కుతుందా.? అన్నదానిపైనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆటగాళ్ళ ప్రాణాల్ని రిస్క్‌లో పడేసి మరీ, ఐపీఎల్ నిర్వాహకులు కరోనాతో చెలగాటమాడుతున్నారన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవ్.
596340 295062How a lot of an appealing guide, maintain on generating much better half 87246
379685 153734Some genuinely quality blog posts on this web site, saved to fav. 630330
581358 860053Wohh just what I was searching for, thanks for putting up. 904954
117640 815251Aw, i thought this was quite a good post. In concept I would like to devote writing such as this moreover – spending time and actual effort to produce a terrific article but exactly what do I say I procrastinate alot by no indicates manage to get something done. 877792