కోవిడ్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. ఆసుపత్రుల్లో సరైన వసతుల్లేక కరోనా రోగుల విలవిల.. కరోనా బాధితుల్ని చెత్త రిక్షాల్లో తరలిస్తున్న వైనం.. కరోనాతో మృతి చెందిన వ్యక్తిని జేసీబీలో స్మశానానికి తరలింపు.. ఇలా చెప్పుకుంటూ పోతే, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి కరోనా విషయంలో ఇప్పటిదాకా వెలుగు చూసిన విషయాలు ఎన్నో ఎన్నెన్నో. అయితే, నాణానికి మరో కోణం కూడా వుంది. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు మూడు లక్షల ఎనభై వేల మంది ఇప్పటికే కరోనా నుంచి కోలుకున్నారు. రోజుకి 10 వేల పైబడి కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తుండడం దురదృష్టకరమే అయినా, కోలుకుంటున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే వుంటోంది.
ఇక, కరోనా విషయంలో సామాన్యులకు భరోసా ఇవ్వాల్సిన అధికార పార్టీ ప్రజా ప్రతినిథులు కరోనా సోకగానే, ఇతర రాష్ట్రాలకు పారిపోతున్నారు. ఈ లిస్ట్ చదివితే చాంతాడంత అవుతుంది. తాజాగా ఏపీకి చెందిన ఓ ఎమ్మెల్యే, ప్రత్యేక హెలికాప్టర్ సమకూర్చుకుని మరీ, పొరుగు రాష్ట్రానికి జంప్ అయిపోయారు కరోనా వైద్య చికిత్స కోసం. అసలేం జరుగుతోంది రాష్ట్రంలో.! ‘ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైద్యం ఎలా తగలడిందో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?’ అని సోషల్ మీడియాలో ప్రభుత్వమ్మీద సెటైర్లు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కార్పొరేట్ ఆసుపత్రులు చాలానే వున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల సంగతి సరే సరి.
ప్రభుత్వ ఆసుపత్రుల మీద మన ప్రజా ప్రతినిథులకు నమ్మకం లేకపోతే, రాష్ట్రంలోనే వున్న కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య చికిత్స పొందొచ్చు. కానీ, ఆ ప్రైవేటు ఆసుపత్రుల మీదా.. అసలు రాష్ట్రం మీదా నమ్మకం లేకనే.. పొరుగు రాష్ట్రాలకు పారిపోతున్నారు ప్రజా ప్రతినిథులు.. అన్న ‘మచ్చ’ మాత్రం చెరిపేయలేనిది. ప్రజా ప్రతినిథులు ఎందుకిలా చేస్తున్నారు.? తమ పార్టీకి చెందిన నేతల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎందుకు వారించలేకపోతున్నారు.? ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇటు ప్రభుత్వానికీ, అటు రాష్ట్రానికీ కరోనా విషయంలో ఇప్పటికే చాలా చెడ్డపేరు వచ్చేసింది.
ప్రజా ప్రతినిథుల ‘పొరుగు’ ప్రేమ రాష్ట్రానికీ, ప్రభుత్వానికీ మరింత చెడ్డపేరు తెస్తుండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? ‘వాళ్ళ దగ్గర డబ్బులున్నాయ్.. వాళ్ళ దగ్గర అవకాశాలున్నాయ్..’ అని సరిపెట్టుకోవడానికి వీల్లేదిక్కడ. ఇది కూడా రాష్ట్ర ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమే.!
722298 166929Quite instructive and good bodily structure of subject matter, now thats user pleasant (:. 785224
816835 853629Yay google is my king assisted me to discover this outstanding website! . 448507
753589 664856There is noticeably a bundle to realize about this. I assume you made various nice points in capabilities also. 440582