Switch to English

వైసీపీకి హైపర్ ఆది సలహా.! శాఖలన్నీ ఎత్తేయండి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

జనసేన పార్టీ నుంచి వచ్చే ఎన్నికల్లో సినీ నటుడు, రచయిత, కమెడియన్ హైపర్ ఆది పోటీ చేయబోతున్నాడా.? సినీ నటుడిగా కాదు, జనసేన అభ్యర్థిగా మీ ముందుకు వచ్చానంటూ ‘హైపర్ ఆది’ ఎందుకు వ్యాఖ్యానించాడు.?

ఆ సంగతి పక్కన పెడితే, జనసేన యువశక్తి పేరుతో జనసేన పార్టీ ఉత్తరాంధ్రలోని రణస్థలంలో ఓ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హైపర్ ఆది సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. కామెడీ పంచ్‌లు వేయడంలో దిట్ట అయిన హైపర్ ఆది, యువశక్తి వేదికగా, పొలిటికల్ పంచ్ డైలాగులు పేల్చాడు.

‘మీకెందుకు అన్ని శాఖలు.. మొత్తం అన్నిటినీ ఎత్తేయండి.. పవన్ కళ్యాణ్‌ని తిట్టే శాఖ ఒకటి పెట్టుకోండి..’ అంటూ వైసీపీకి హైపర్ ఆది ఓ సలహా ఇచ్చేశాడు. ‘పవన్ కళ్యాణ్ ప్రజల ప్రేమకు లొంగుతారేమోగానీ.. డబ్బుకి లొంగరు..’ అంటూ ప్యాకేజీ విమర్శలపై హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి.

‘రెండు చోట్లా పవన్ కళ్యాణ్ ఓడిపోయారంటున్నారు.. ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఇంతలా జనానికి సేవ చేస్తోంటే.. ఆ పవన్ కళ్యాణ్ గెలిస్తే, కష్టం సామాన్యుల గడపను సైతం తాకనివ్వరు..’ అంటూ హైపర్ ఆది ఉద్వేగంగా ప్రసంగించాడు.

జనసేన పార్టీకి మొదటి నుంచీ హైపర్ ఆది మద్దతిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో కొంత పొలిటికల్ హీట్ కూడా ఎదుర్కొన్నాడు హైపర్ ఆది. అయినాగానీ, పవన్ కళ్యాణ్ మీద వీరాభిమానాన్ని మాత్రం ఎప్పుడూ చాటుకుంటూనే వున్నాడు.

‘కష్టపడితే ఎవరికైనా ప్రపంచంలో ఎంత గొప్ప పదవి అయినా వస్తుంది.. కానీ, పవన్ కళ్యాణ్ అనే పదవి ఆయనకు తప్ప ఇంకెవరికీ దక్కదు..’ అంటూ పవన్ కళ్యాణ్ గొప్పతనాన్ని తనదైన స్టయిల్లో చెప్పాడు హైపర్ ఆది.

‘డబ్బు మీద ఆశలేని వ్యక్తి పవన్ కళ్యాణ్.. జనసేనను గెలిపిస్తే, ప్రజాధనం ఒక్క పైసా కూడా వృధా కాకుండా చేస్తారు. రికార్డుల కోసం, సంపాదన కోసం ఏ హీరో అయినా సినిమాలు చేస్తాడు.. రైతుల కన్నీళ్ళు తుడవడానికి పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తున్నారు..’ అని హైపర్ ఆది అనగానే.. ఆ ప్రాంగణం ‘జై పవన్ కళ్యాణ్’ అనే నినాదాలతో మార్మోగింది.

‘ఇక్కడికి వచ్చినవారు బతుకు మీద భయంతో.. జనసేన మీద నమ్మకంతో వచ్చారు.. బీరు, బిర్యానీ మీద ఆశతో వచ్చినవాళ్ళు కాదు..’ అంటూ హైపర్ ఆది వ్యాఖ్యానించడం గమనార్హం.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...