Chandrababu Naidu: చంద్రబాబు తప్పు చేశారా.? లేదా.? అన్నది కోర్టులు తేల్చుతాయ్. మన ఘన భారతదేశంలో న్యాయ వ్యవస్థలు ఎలా పని చేస్తున్నాయో చూస్తూనే వున్నాం.! దర్యాప్తు సంస్థల మీద రాజకీయ ఒత్తిళ్ళు.. ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయ్.!
సరే, అది వేరే చర్చ.! తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. డెబ్భయ్ నాలుగేళ్ళ వయసులో చంద్రబాబుకి అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా వుంటాయ్. పైగా, ఆయనకు చర్మ సంబంధిత అనారోగ్య సమస్య చాలాకాలంగా వుంది.
వయసు మీద పడ్డం వల్ల బీపీ, షుగర్ వంటి సమస్యల సంగతి సరే సరి.! కానీ, రాజమండ్రి కేంద్ర కారాగారం అధికారులు మాత్రం, చంద్రబాబు భేషుగ్గా వున్నారని చెబుతున్నారు. అంతేనా, జైలుకు వచ్చాక, చంద్రబాబు బరువు కిలో వరకు పెరిగిందనీ అంటున్నారు.!
ఇంటి నుంచే చంద్రబాబుకి ఆహారం వెళుతోంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా వున్నారు. ఆయనకు ఇప్పట్లో ఈ కేసు నుంచి ఊరట లభించే అవకాశమూ కనిపించడంలేదు. చర్మ సంబంధిత అనారోగ్య సమస్య నేపథ్యంలో, జైల్లోనే అందుబాటులో వున్న వైద్యులతో చికిత్స చేయించారు.
అనంతరం, రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి నుంచి వైద్య నిపుణుల్ని రప్పించి, చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై మరింత లోతుగా పరీక్షలు చేయించారట. ‘ఆల్ ఈజ్ వెల్’ అంటున్నారు కేంద్ర కారాగారం అధికారులు.
మరి, ఈ బరువు పెరగడమేంటి.? జైల్లో ఏసీ ఎక్కడా వుండదని జైలు అధికారులు చెప్పడమేంటి.? చర్మ సంబంధిత అనారోగ్యం సాకు చూపి, స్టెరాయిడ్లు ఎక్కువ ఇచ్చేసి, ఆయన ప్రాణాలకు ముప్పు తీసుకురావాలని కుట్ర జరుగుతోందని టీడీపీ ఆరోపించడమేంటి.?