Hanu-Man: సంక్రాంతి బరిలో పెద్ద సినిమాల మధ్య చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్ సాధించిన సినిమా ‘హను-మాన్’. (Hanu-Man) తెలుగు రాష్ట్రాల నుంచి ఓవర్ సీస్ వరకూ ఎక్కడ చూసినా జనాదరణ.. హౌస్ ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా 100కోట్ల క్లబ్ లో చేరిపోవడం సినిమా ఘన విజయానికి నిదర్శనంగా నిలిచింది. నార్త్ అమెరికాలో ఏకంగా 4రోజుల్లోనే 3మిలియన్ల మార్కు చేరుకుని టాప్ 10 తెలుగు సినిమాల్లో స్థానం దక్కించుకుంది.
‘హను-మాన్’ మ్యానియాకు నార్త్ అమెరికాలో ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లలో బాహుబలి, సలార్ రికార్డులను అధిగమించి సంచలనం రేపుతోంది. దీంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా వేదికగా ‘100కోట్ల క్లబ్బులో చేరిన నా మొదటి సినిమా’ అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. సినిమా విజయంపై చిరంజీవి, కె.రాఘవేంద్రరావు, గోపీచంద్, రామ్ పోతినేని, శరత్ కుమార్, రాధిక, మాధవన్.. తదితరులు ప్రశంసించారు. తేజ సజ్జా హీరోగా నటించారు.
My first century in films 😊🙏🏽 pic.twitter.com/VsiqdttRyR
— Prasanth Varma (@PrasanthVarma) January 16, 2024