Hanu-Man: ‘సంక్రాంతికి చిన్న సినిమాగా విడుదలై భారీ విజయం సాధించిన ‘హను–మాన్’ ఇంకా ధియేటర్ల వద్ద సందడి చేస్తోంది. పోటీలో పెద్ద సినిమాలు ఉన్నా కూడా కంటెంట్ పై నమ్మకంతో సంక్రాంతి సీజన్ ను వదులుకోలేదు ‘హను–మాన్’ టీమ్. అందుకు తగ్గట్టే మంచి టాక్ తో వారం వారం ధియేటర్లు పెంచుకుంటూ అద్భుత విజయం సాధించింది. ఈక్రమంలో మరో ఘనతను సొంతం చేసుకుంది.
బాలీవుడ్ లో ‘హను–మాన్’ సినిమా రూ.200కోట్ల మార్కును దాటింది. 2024లో ఈ ఘనతను సాధించిన రెండో సినిమాగా నిలిచింది. హృతిక్ నటించిన ‘ఫైటర్’ ఇప్పటికే రూ.350కోట్ల మార్కును దాటింది. మొత్తంగా వసూళ్లలో ప్రపంచవ్యాప్తంగా ‘హను–మాన్’ ఇప్పటివరకూ రూ.300కోట్ల మార్కు దాటడం విశేషం. పోటీగా వచ్చిన పెద్ద సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూండగా ‘హను–మాన్’ మాత్రం ఇంకా ధియేటర్ల వద్ద సందడి చేస్తోంది.
ప్రస్తుతం కొత్త సినిమాలేవీ లేకపోవడంతో మరిన్ని కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు.. ‘హను–మాన్’ ఓటీటీ స్ట్రీమింగ్ మార్చి2న ఉండొచ్చని సమాచారం.