Switch to English

గ్లామర్‌ గెలిచేనా.. ఎంపీలు అయ్యేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

చట్టసభలకు ఒకప్పుడు గ్లామర్‌ అంతగా పనికొచ్చేది కాదు. కానీ రానురాను పార్టీలు కూడా గ్లామర్‌ను ఎక్కువగా నమ్ముకుంటున్నాయి. పార్టీలతో సంబంధం లేకుండా ఎవరికి వారు కాస్తా పేరున్న నటులను రాజకీయాల్లోకి తీసుకొచ్చి తమకు కాసిన్ని ఓట్లు రాలేలా చేసుకుంటున్నాయి. దానికి వారికి సముచిత స్థానాన్ని ఇవ్వడం లేదా ఇతరత్రా తాయిలాలతో లాక్కుంటున్నారు. కొంతమంది నేతలు ఊరికే ప్రచారం చేస్తేచాలు కనీసం మన సభలకు జనాలు వస్తారు అనేవారు లేకపోలేదు. వీరందరికీ భిన్నంగా కొందరు మహిళామణులు చట్టసభల్లోకి గ్లామర్‌తో ఎంటర్‌ అవుతున్నారు. వీరికి ప్రజాధరణ మాత్రం అంతంతం మాత్రమే అని చెప్పవచ్చు. కేవలం ఒకసారి చూసి ఆ తరువాత పక్కన పెడుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాంటి వారిలో కొందరు మహిళామణులు ఏటికి ఎదురీదుతూ ఉన్నారు. వారిలో ఒక్కోక్కరి గురించి చర్చిద్దాం..!

జయప్రదంగా అడుగుపెట్టేనా?

అలనాటి గ్లామరస్‌ హీరోయిన్‌ తెలుగమ్మాయి జయప్రద గురించి తెలియని వారుండరు. నాటి అగ్ర హీరోలందరితో ఆమె నటించి మెప్పించింది. అమర్‌సింగ్‌ ప్రోద్భలంతో ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జయప్రద ఎస్పీ పార్టీ తరపున ఎంపీగా గతంలో గెలిచారు. తదనంతర పరిణామాలతో అమర్‌సింగ్‌ బయటికి రావడంతో జయప్రద కూడా బయటికి రాక తప్పలేదు. ఆ తరువాత చాలా పార్టీల గడపలు తొక్కినా ఎక్కడా వర్కౌట్‌ కాలేదు. చివరికి బీజేపీలో చేరి ప్రస్తుతం గతంలో ఆమె ప్రాతినిథ్యం వహించిన రాంపూర్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ పడుతున్నారు. రెండు ప్రధానా పార్టీలు అక్కడ ఒకటి కావడంతో జయప్రద గెలుపు చాలా కష్టం అనే అభిప్రాయం ఉంది. చూడాలి మరి ఈ గ్లామర్‌ ఎంతమాత్రం పనిచేస్తుందో.

అంబరీష్‌ సెంటిమెంట్‌పై గెలిచేనా?

మరో తెలుగు తార సుమలత. చాలా భాషల్లో హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన సుమలత కన్నడింటి కోడలు అయ్యింది. తన సహనటుడు కన్నడ స్టార్‌ హీరో అంబరీష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది సుమలత. కాంగ్రెస్‌ పార్టీకి చిరకాలం పాటు సేవచేసిన అంబరీష్‌ మంత్రిగా కూడా సేవలు అందించారు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయకుండా జేడీఎస్‌కు లోపాయికారిగా మద్ధతు ప్రకటించడంతో కాంగ్రెస్‌కు అక్కడ ధారుణ ఫలితాలు వచ్చాయి. అంబరీష్‌ ఇటీవలే ఆకస్మికంగా మరణించడంతో సుమలత ఇండిపెండెంట్‌గా మండ్యా నుంచి ఎంపీగా బరిలో నిలిచారు.

కన్నడ చిత్ర పరిశ్రమ అంతా సుమలతకు బాసటగా నిలిచింది. ప్రత్యర్థిగా కుమారస్వామి తనయుడు నిఖిల్‌గౌడ బరిలో ఉన్నారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ అక్కడ పోటీ చేయడంలేదు. చివరికి బీజేపీ కూడా సుమలతకు మద్ధతు ప్రకటించింది. కాంగ్రెస్‌ నేతలు కూడా లోపాయికారిగా సుమలతకు మద్ధతునిస్తున్నారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు బలమైన అభ్యర్థులు బరిలో ఉన్నా.. కేవలం తండ్రి చాటు బిడ్డగా బరిలో నిలిచిన హీరో నిఖిల్‌గౌడ సుమలతకు ఏమాత్రం పోటీఇచ్చే పరిస్థితి లేదని అంటున్నారు.

డ్రీమ్‌గర్ల్‌ పరిస్థితేంటో..!

హిందీ చిత్ర పరిశ్రమలో డ్రీమ్‌గర్ల్‌గా పేరుతెచ్చుకున్న హేమమాలిని ప్రస్తుతం విపత్కర పరిస్థితిని ఎదుర్కుంటున్నారు. మథుర నుంచి గతంలో ఎంపీగా బంపర్‌ మెజారిటీతో నెగ్గిన హేమమాలిని కేంద్రంలో బాగానే పలుకుబడి సంపాధించారు. గెలిచిన తరువాత తమ నియోజకవర్గానికి ఒక్కసారి కూడా రాకపోవడం. అక్కడి ప్రజల కష్టాలను అసలు పట్టించుకోకపోవడం పెద్ద మైనస్‌గా నిలుస్తున్నాయి. బీజేపీ గాలిమీద గెలిచిన హేమమాలిని.. కనబడుటలేదు అని పోలీస్‌ స్టేషన్‌లో కేసులు కూడా పెట్టారు. ఇటీవలే ఆమె చేసిన ఒక పోస్ట్‌ విపరీతంగా ట్రోలింగ్‌కు గురి అయ్యింది. మరి ఈసారి ఈమె అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి.

వర్మ హీరోయిన్‌ కొత్తగా కొంగొత్తగా

దర్శకుడు రామ్‌ గోపాల్‌వర్మ తమ సినిమాల్లో చాలావరకు గ్లామర్‌గా చూపించిన హీరోయిన్‌ ఊర్మిల. ప్రసుత్తం కాంగ్రెస్‌ పార్టీ నుంచి ముంబయ్‌ నార్త్‌ నుంచి బరిలో ఉన్నారు. తమ బొద్దుబొద్దు మాటలతో జనాన్ని బాగానే ఆకట్టుకుంటున్నారు. ఇటీవలే నామినేషన్‌ సందర్భంగా కోట్ల రూపాయల ఆస్తులు ప్రకటించడంతో ఒక్కసారిగా ఊర్మిల వార్తల్లో హైలెట్‌గా నిలిచారు. కాంగ్రెస్‌ పార్టీకి చాలాసానుకూల నియోజకవర్గం కావడం.. గతంలో ఇదే నియోజవర్గం నుంచి బాలీవుడ్‌ హీరో గోవింద గెలవడంతో.. కాంగ్రెస్‌ ఈసారి ఈ గ్లామర్‌ హీరోయిన్‌ను పోటీకి దింపింది. కాంగ్రెస్‌ అనుకూల నియోజకవర్గం కావడంతో ఊర్మిల ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందని అంటున్నారు.

ఇంకా చాలామంది తారలు పోటీలో ఉన్నా వీరి విషయంలోనే వార్తలు ప్రస్తుతం హల్‌చల్‌ చేస్తున్నాయి. చూడాలి మరి ఎవరు తమసత్తా చాటుతారో..!

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...