Switch to English

ఏపీలో విదేశీ విద్యకు మంగళమేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం అట్టహాసంగా జగనన్నవిద్యాకానుక ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కిట్లు అందజేస్తారు. ఇదే సమయంలో పేద, మధ్యతరగతి విద్యార్థుల విదేశీ కలలపై నీళ్లు పోసేలా తీసుకున్న నిర్ణయం వెలుగులోకి వచ్చింది. విదేశీ విద్య పథకం కింద కొత్తగా విద్యార్థుల ఎంపిక ప్రక్రియను నిలిపివేయాలని ఇటీవల ఆదేశించింది. ఈ పథకాన్ని పూర్తిగా సమీక్షించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈ పథకం కింద లబ్ధి పొందినవారు ఏం చేస్తున్నారు వంటి వివరాలు సేకరించాలని ఆదేశించింది. దీంతో ఈ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

విదేశాలలో చదువుకోవాలనే విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో 2013లో ఈ పథకాన్ని ప్రారంభించారు. తొలుత ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం దీనిని ప్రారంభించగా.. 2014లో బీసీ, ఈబీసీ, కాపు విద్యార్థులకు కూడా దీనిని వర్తింపజేశారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా సింగపూర్, కెనడా, రష్యా, ఫ్రాన్స్ తదితర 15 దేశాల్లో పీజీ, పీహెచ్ డీ, ఎంబీబీఎస్ చదువుకోవాలనుకునే అర్హులైన విద్యార్థులకు ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందజేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రూ.15 లక్షలు.. ఈబీసీ, కాపు, ఇతరులకు రూ.10 లక్షల చొప్పున ఇస్తారు. ఇప్పటివరకు దాదాపు 4500 మంది ఈ పథకం కింద లబ్ధి పొందారు.

ఈ నేపథ్యంలో ఈ పథకం అమలుపై సర్కారు సమీక్షించాలని నిర్ణయం తీసుకోవడంతో.. ఇక దీని కొనసాగింపు ఉంటుందా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటికే పలు సంక్షేమ పథకాల కోసం భారీగా వెచ్చిస్తున్న సర్కారు.. లోటు బడ్జెట్ లో ఉంది. దీంతో ఎక్కడ ఖర్చులు తగ్గించడానికి అవకాశం ఉందో చూసే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని అంటున్నారు.

అయితే, ఒక్క విద్యార్థికే లక్షలు ఇచ్చేకంటే.. ఆ మొత్తంతో ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరిస్తే, ఎక్కువ మందికి లబ్ధి కలుగుతుంది కదా అని వైసీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మొత్తానికి విదేశీ విద్య పథకానికి మంగళం పాడేస్తారా లేక కొంతకాలం తర్వాత కొనసాగిస్తారా అనే అంశంపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఈ పథకం కొనసాగింపు కష్టమే అని కొందరు అధికారులు పేర్కొంటున్నారు.

7 COMMENTS

  1. 403203 266041 Youre so cool! I dont suppose Ive read anything like this before. So nice to discover somebody with some original thoughts on this subject. realy thank you for starting this up. this web site is something that is necessary on the internet, someone with a little originality. valuable job for bringing something new towards the internet! 702296

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...