మంచు మనోజ్ మూడు సంవత్సరాల తర్వాత ‘అహం బ్రహ్మాస్మి’ చిత్రాన్ని చేయబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఇటీవలే సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ ను కూడా విడుదల చేశాడు. నేడు సినిమా ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశాడు. అంతా అనుకున్నట్లుగానే ఈ సినిమాలో మనోజ్ అఘోరాగా కనిపించబోతున్నట్లుగా ఫస్ట్‌లుక్ ను చూస్తుంటే అనిపిస్తుంది. పూర్తిగా అఘోరాలా కాకుండా కాస్త విభిన్నమైన గెటప్‌లో మనోజ్ కనిపించే అవకాశాలు ఉన్నాయి.
శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో మంచు మనోజ్ ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెల్సిందే. తెలుగులో మాత్రమే కాకుండా పలు భాషల్లో ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. మంచు మనోజ్ ఈ చిత్రంతో మళ్లీ ఫుల్ స్వింగ్‌లో ఫామ్‌లోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.
మూడు సంవత్సరాల గ్యాప్‌ను ఈ సినిమాతో ఫిల్ చేయాలనే పట్టుదలతో మంచు మనోజ్ ఉన్నాడు. ఈ చిత్రం కోసం మంచు మనోజ్ చాలా కష్టపడుతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అహం బ్రహ్మాస్మి టైటిల్‌తోనే సినిమా అంచనాలు పెంచేసిన మంచు మనోజ్ ఫస్ట్ లుక్‌తో ఆ అంచనాలు మరింతగా పెంచేశాడు. సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యిందని, ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
775244 612387I as nicely conceive so , perfectly indited post! . 638677
608538 650083 There are some interesting points in time in this post but I dont know if I see all of them center to heart. There is some validity but I will take hold opinion until I appear into it further. Excellent write-up , thanks and we want more! Added to FeedBurner as effectively 599506