అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో చిత్రంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ను దక్కించుకున్నాడు. ఇటీవలే ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. 100కు పైగా థియేటర్లలో ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. బన్నీ ఇప్పుడిప్పుడే ఆ మూడ్ నుండి బయటకు వస్తున్నాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో బన్నీ తదుపరి చిత్రాన్ని చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి అయినా మొయిన్ షూటింగ్ ను మాత్రం ఇప్పుడే చేయబోతున్నారు.
రంగస్థలం చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సుకుమార్ బన్నీతో సినిమాకు రెడీ అయ్యాడు. అల వైకుంఠపురంలో విడుదలకు ముందే సుకుమార్ మూవీ మొదలు పెట్టాలనుకున్నా కూడా ఏదో కారణంగా వాయిదాలు పడుతూ వచ్చింది. ఇప్పుడు సినిమా రెగ్యులర్ షూటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ సమయంలోనే సినిమా దసరాకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.
షూటింగ్ ప్రారంభం అయిన వెంటనే దసరా కానుకగా రాబోతుంది అంటూ ప్రకటించడం ఆశ్చర్యంగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సుకుమార్ సినిమా అంటే కాస్త మెల్లగానే పూర్తి చేస్తాడు. కాని ఈ సినిమాను మాత్రం హడావుడిగా చేసే ఉద్దేశ్యంలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. దసరాకు సినిమాను తీసుకుని రావాలి అంటే హడావుడిగా చేయాల్సి రావచ్చు. రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన సుకుమార్ బన్నీకి ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి.
36637 519288Youve really written a extremely very good quality post here. Thank you quite much 282020
371663 719960You may be websites successful individuals, it comes effortlessly, therefore you also earn you see, the jealousy of all of the ones plenty of journeymen surrounding you can have challenges within this challenge. motor movers 613390