Switch to English

బాలయ్య హీరోయిన్‌కి తొలి ‘అనుభవం’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన ‘సింహా’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన స్నేహా ఉల్లాల్‌ అందరికీ గుర్తుండే వుంటుంది. బాలీవుడ్‌లో జూనియర్‌ ఐశ్వర్యారాయ్‌గా స్నేహా ఉల్లాల్‌ గుర్తింపు పొందింది. ఐశ్వర్యారాయ్‌తో ఎఫైర్‌ బెడిసికొట్టాక, సల్మాన్‌ఖాన్‌ అచ్చం ఆమెలా వున్న స్నేహా ఉల్లాల్‌ని బాలీవుడ్‌కి తీసుకొచ్చాడంటారు చాలామంది. సల్మాన్‌ఖాన్‌కి ఇలాంటి చిత్రమైన అలవాటున్న సంగతి చాలామందికి తెల్సిందే.

కత్రినా కైఫ్‌తో వ్యవహారం చెడాక అలాంటి ఫీచర్స్‌ వున్న జరీన్‌ఖాన్‌ని జూనియర్‌ కత్రినాగా బాలీవుడ్‌కి పరిచయం చేసిన ఘనుడు ఈ సల్మాన్‌ఖాన్‌. సరే, స్నేహా ఉల్లాల్‌ విషయానికొస్తే, ఈ బ్యూటీ ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యింది. చక్కనమ్మ ఏం చేసినా అందమే అన్నట్టు, ఈమె ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతూ అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో పెడితే, ‘హౌ క్యూట్‌..’ అన్నారు చాలామంది.

తనను అందరూ మర్చిపోయిన టైమ్‌లో, బికినీ ఫొటోలతో సోషల్‌ మీడియాని హీటెక్కించేసిన స్నేహా ఉల్లాల్‌ తద్వారా పెంచుకున్న ఫాలోయింగ్‌ని, ఇప్పుడిలా ఉపయోగించుకుంటోంది. జ్వరం వచ్చి, ఆసుపత్రిలో చేరితే ఆ విషయాన్ని సోషల్‌ మీడియాలో ఫొటోలు పెట్టి చెప్పాలా? అనే ప్రశ్న మీ మెదడులోంచి పుట్టుకొచ్చిందా? అయితే అది మీ తప్పు కానే కాదు. ఆసుపత్రిలో సర్జరీ చేయించుకుంటూ లైవ్‌ వీడియోలు కూడా పెడుతున్నారు కొందరు సెలబ్రిటీలు సోషల్‌ మీడియాలో. సోషల్‌ మీడియాలో పైత్యం ఆ రేంజ్‌కి చేరింది.

స్నేహా ఉల్లాల్‌ జ్వరం విషయానికొద్దాం. ఆమె తొలిసారిగా ఆసుపత్రి పాలయ్యిందట. అదీ అసలు కథ. ‘నేను తొలిసారిగా అనారోగ్యంపాలై ఆసుపత్రిలో చేరాను. మీరంతా ఎప్పుడూ ఆరోగ్యంగా వుండాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ సోషల్‌ మీడియాలో ఫొటోలు పెట్టింది స్నేహా ఉల్లాల్‌. కొందరు ‘హౌ క్యూట్‌’ అనే ఎక్స్‌ప్రెషన్‌తోపాటు ‘గెట్‌ వెల్‌ సూన్‌’ అని కూడా ఆమెకు రిప్లయ్‌ ఇస్తే, ఇంకొందరు ‘ఇదెక్కడి పైత్యం?’ అని ప్రశ్నిస్తున్నారు. ఇన్నేళ్ళూ హాస్పిటల్‌కి వెళ్ళకుండా వున్నావా? నమ్మమంటావా? అని ఆమెను ట్రాలింగ్‌ చేసేస్తున్నారు. బాలయ్య తొడకొడితే, ట్రెయిన్‌ కూడా ఝామ్మని వెళ్ళిపోతుంటుంది.. ఆగిపోతుంటుంది. ఎంతైనా బాలయ్య హీరోయిన్‌ కదా, ఆ ఎకసెక్కాలు బాగా వంటపట్టేసినట్టున్నాయి. లేకపోతే, ఆసుపత్రిలో చేరడం తొలిసారేంటి?

5 COMMENTS

  1. 274945 358012Youre so cool! I dont suppose Ive learn anything like this before. So nice to uncover any person with some authentic thoughts on this subject. realy thank you for starting this up. this site is something that is wanted on the internet, someone with just a little bit originality. helpful job for bringing something new towards the web! 609987

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు కూడా వుంటారు. అందుకే, యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...